Home Film News Junior NTR: జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త ప్ర‌య‌త్రం.. సొంత నిర్మాణంలో ఆ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్న యంగ్ టైగర్
Film NewsGossips

Junior NTR: జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త ప్ర‌య‌త్రం.. సొంత నిర్మాణంలో ఆ హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్న యంగ్ టైగర్

Junior NTR: ఇప్ప‌టి హీరోలు గ‌తంలో స్టార్స్ మాదిరిగా కాకుండా చాలా కొత్త‌గా ఆలోచిస్తున్నారు. కేవ‌లం సినిమాల‌తో స‌రిపెట్టుకోకుండా బిజినెస్  చేయ‌డం లేదంటూ నిర్మాత‌గాను స‌త్తా చూపించాల‌ని తాప‌త్రయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌కి చెందిన చాలా మంది హీరోలు బిజినెస్‌లతో  స‌త్తా చాటుతూనే మ‌రోవైపు నిర్మాత‌గాను అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చినట్టు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్  ఒక  కొత్త ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించబోతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ  ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న అనుకుంటున్నాడ‌ట‌.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి  అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తూ కొత్త కొత్త డైరెక్ట‌ర్స్ ని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు.  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి వచ్చిన సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి మరియు వసిష్ఠ వంటి డైరెక్టర్స్ ఈ రోజు ఏ స్టేజ్‌లో ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. మ‌రి రానున్న రోజుల‌లో ఎన్టీఆర్ బ్యాన‌ర్ నుండి ఎంత మంది టాలెంట్ డైరెక్ట‌ర్స్ ప‌రిచ‌యం అవుతారో, ఎంత మంది కొత్త న‌టీన‌టులు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి ప‌రిచ‌యం అవుతారో చూడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన మొదటి చిత్రం ప్రముఖ హీరో నాని తో చేయబోతున్నట్టు స‌మాచారం. నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌యోగాల‌కి మారు పేరు. ఆయ‌నతో స‌రికొత్త‌గా ఓ ప్ర‌యోగం చేయాల‌ని జూనియ‌ర్ భావిస్తున్న‌ట్టు టాక్, ఇందులో ఎంతమాత్రం నిజం ఉందొ అనేది చూడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్  టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జూనియ‌ర్ భావిస్తున్నాడ‌ట‌. ఈ సినిమా తర్వాత హ్రితిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ మరియు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చెయ్యనున్నాడు యంగ్ టైగ‌ర్ . ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్  కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించి దానిపై ఎంత శ్రద్ద చూపిస్తారో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...