Home Film News Vajrala Donga : చిరంజీవి-శ్రీదేవిల ‘వజ్రాల దొంగ’ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Film News

Vajrala Donga : చిరంజీవి-శ్రీదేవిల ‘వజ్రాల దొంగ’ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Vajrala Donga
Vajrala Donga

Vajrala Donga: మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవిది సూపర్ హిట్ పెయిర్..వీళ్ల కాంబినేషన్‌లో ఎన్నో సక్సెస్ ఫుల్ ఫిల్మ్స్ వచ్చాయి.. ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొచ్చిన ట్రాక్ రికార్డ్ చిరుదైతే.. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి సౌత్‌లోనే నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగిన స్టోరీ శ్రీదేవిది..

అయితే చిరు, శ్రీదేవిల కలయికలో.. భారీ అంచనాలతో మొదలైన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే విషయం చాలా మందికి తెలీదు. ఈ సినిమా కోసం శ్రీదేవి నిర్మాతగా కూడా మారారు. తన చెల్లెలు శ్రీలత పేరు మీద శ్రీలత ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు. తన అభిమాన దర్శకుడు కోదండరామి రెడ్డిని దర్శకుడిగా నియమించుకున్నారు. ఆ మూవీ గురించిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చిరు, శ్రీదేవి జంటగా.. స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో స్టార్ట్ చేసిన ఈ చిత్రానికి ‘వజ్రాల దొంగ’ అనే టైటిల్ అనుకున్నారు కానీ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు. మణిరత్నం ‘మౌనరాగం’ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఆధారంగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ కథ రాశారు. బప్పీ లహరిని మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలక్ట్ చేశారు.

అప్పటివరకు శ్రీదేవికి అంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉందని ఎవరికీ తెలియదు.. ఎప్పుడు, ఎలా కలెక్ట్ చేశారో తెలియదు కానీ ఆమె దగ్గర బోల్డెంత మ్యూజిక్ కలెక్షన్ ఉంది.. అవన్న బప్పీ లహరికి వినిపించి దగ్గరుండి సాంగ్స్ రికార్డ్ చేయించుకున్నారు. సినిమా ఓపెనింగ్‌కి ఎమ్‌జీఆర్, కమల్ హాసన్, రాధిక తదితరులు వచ్చారు. చెన్నైలో సెట్ వేసి ఓ సాంగ్ షూట్ చేశారు.

అప్పటికే ఈ సినిమాకి మాంచి క్రేజ్ వచ్చింది.. ఎప్పుడూ లేనిది బయ్యర్స్, కోదండరామి రెడ్డి దగ్గరకి వచ్చి.. ‘సినిమా మాకు ఇప్పించండి’ అంటూ రిక్వెస్ట్ చెయ్యడం మొదలెట్టారు. రైట్స్ కోసం పోటీ పడేవారు.. శ్రీదేవికి ఎలాగైనా రికమండ్ చెయ్యమనేవారు.. సినిమాకి వచ్చిన హైప్ చూసి కోదండరామి రెడ్డికి ఎక్కడో తేడా కొట్టింది..

శ్రీదేవి దగ్గరకెళ్లి.. ‘అమ్మా.. నాకెందుకో ఇప్పుడు మనం చేస్తున్న సబ్జెక్ట్ అంచనాలను అందుకుంటుందా, లేదా? అని డౌట్‌గా ఉంది.. ఏం చేద్దాం?’’ అని అడిగారట.. శ్రీదేవి.. ‘సాంగ్స్ అయితే బాగా వచ్చాయి.. సబ్జెక్ట్ గురించి మీకు తెలిసినంతగా నాకు తెలియదు.. పోనీ, దీన్ని ఇక్కడితో ఆపేసి.. ఇంకో మంచి కథతో సినిమా చేద్దాం.. లేదంటే, ఇదే కథను ఇంకా బాగా డెవలప్ చేసే ఛాన్స్ ఉందేమో చూడండి’ అన్నారట..

తర్వాత చాలామంది రచయితలతో కూర్చుని కథ గురించి చర్చించినా.. ఆశించిన స్థాయిలో ఔట్ పుట్ రాకపోవడంతో.. శ్రీదేవి, అనిల్ కపూర్‌తో నటించగా బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘మిస్టర్ ఇండియా’ సినిమాను రీమేక్ చేద్దామా? అని అడిగారట. ఈ సినిమాకి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా ఒక నిర్మాత.

శ్రీదేవి చెప్పింది కదా అని చిరంజీవి కూడా సినిమా చూశారు. పెద్దగా నచ్చలేదు సరికదా లెంగ్త్ ఎక్కువనిపించింది.. ఇలా చాలా ప్రయత్నాలు చేసి, చివరికి చిరంజీవి, శ్రీదేవిల ఇమేజ్, కాంబినేషన్‌కున్న క్రేజ్‌కి తగిన కథ దొరక్కపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత శ్రీదేవి మళ్లీ ఎప్పుడూ నిర్మాణం జోలికి వెళ్లలేదు.. ఇదీ ‘వజ్రాల దొంగ’ వెనకున్న కథ..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...