Home Film News Aditi Shankar : కార్తి సినిమా రిలీజ్‌కి ముందే సెకండ్ ఛాన్స్ అందుకున్న శంకర్ కూతురు
Film News

Aditi Shankar : కార్తి సినిమా రిలీజ్‌కి ముందే సెకండ్ ఛాన్స్ అందుకున్న శంకర్ కూతురు

Aditi Shankar
Aditi Shankar

Aditi Shankar: డైరెక్టర్ శంకర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. పేరుకి తమిళ దర్శకుడైనా.. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్‌లో శంకర్ సినిమాలకుండే క్రేజే వేరు.. ఆయన ఫస్ట్ ఫిలిం ‘జెంటిల్ మెన్’ నుండి ఇప్పటివరకు ప్రతి సినిమా తెలుగులో డబ్ అయ్యాయి.

ఆయన మేకింగ్ స్టైలే వేరు.. ఇటీవలే దర్శకుడిగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. శంకర్ పెద్ద కూతురు అదితి శంకర్ కోలీవుడ్‌లో కార్తి హీరోగా నటించిన ‘విరుమాన్’ (Viruman) హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎమ్.ముత్తయ్య దర్శకత్వంలో కార్తి అన్నయ్య సూర్య, వదిన జ్యోతిక నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 12న తమిళనాట రిలీజ్ అవుతుంది.

ఇప్పుడు తమిళ్ యంగ్ స్టార్ శివ కార్తికేయన్ పక్కన కొత్త సినిమా కమిట్ అయ్యింది అదితి. అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్ మీద అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మావీరన్’ (Maaveeran) తెలుగులో ‘మహావీరుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం RC 15 చేస్తున్నారు. వచ్చేనెలలో ‘విశ్వనటుడు’ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చెయ్యబోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...