Home Film News Suma-Sharmila: సుమ షోలో ష‌ర్మిల‌ని ఇలా ఆడేసుకున్నారేంటి.. తిట్టిపోస్తున్న ష‌ర్మిల అభిమానులు
Film News

Suma-Sharmila: సుమ షోలో ష‌ర్మిల‌ని ఇలా ఆడేసుకున్నారేంటి.. తిట్టిపోస్తున్న ష‌ర్మిల అభిమానులు

Suma-Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర డైలాగ్ ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని… ఆడ పిల్ల అంటే ఆడ పిల్ల ఈడ పిల్ల కాదు అని ష‌ర్మిల చెప్ప‌డంతో దీనిపై సోష‌ల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ న‌డిచిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొంద‌రు సెల‌బ్రిటీలు అయితే వీటిపై రీల్స్ చేయ‌డం, కొన్ని షోల‌లో ష‌ర్మిల డైలాగ్ ని వాడి కామెడీ పండించ‌డం కూడా మ‌నం చూశాం. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర కాగా, రేవంత్ పాదాల మీద నడిచేకంటే వాహనాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారని… దీన్ని పాదయాత్ర అంటారా? అంటూ షర్మిల విమ‌ర్శ‌లు చేసింది.. అలా షర్మిల పాదయాత్ర డైలాగ్ పై ట్రోలింగ్స్, రీల్స్, కామెడీ వీడియోలు తెగ పుట్టుకొస్తున్నాయి.

తాజాగా సుమ అడ్డా కార్యక్రమంలో కూడా ఇలాంటి డైలాగ్‌ని వాడేశారు. ఈ షో ప్ర‌తి శనివారం నాడు ప్ర‌సారం కానుండ‌గా, తాజాగా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో సుమ ఒక యాక్టర్ ని స్కూల్ లో విద్యార్థులకి సంబందించిన పాయింట్ అడుగుతుంటే అదిరే అభి ఓ పంచ్ వేస్తాడు. అసలు విద్యార్థులని విద్యార్థులు అని ఎందుకంటారో తెలుసా అని అనగా, అభి పక్కనే ఉన్న ఒక లేడీ ఎందుకంటే వాళ్లు విద్యార్థులు కాబట్టి అని అనడంతో సుమ‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు న‌వ్వేస్తారు. అయితే ఇది సామాన్య ప్రేక్షకుల‌కి కామెడీగానే అనిపించిన ష‌ర్మిల అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దివంగత నేత, ప్రతి తెలుగువాడి గుండెల్లో నేటికీ కొలువుతీరి ఉన్న మహా నేత, సమైక్య ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసిన డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అయిన వై ఎస్ షర్మిల గారిని అలా విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని కొంద‌రు అంటున్నారు.

 

సుమ షోకి సంబంధించిన ప్రోమోను చూసిన మేము చాలా బాధపడుతున్నామని రాజశేఖర్ రెడ్డి అభిమానులు, అలానే షర్మిల అభిమానులు వీడియోకి తెగ కామెంట్స్ చేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న ష‌ర్మిల‌ని అలా ఎలా విమ‌ర్శిస్తారు అంటూ కొంద‌రు ఫైర్ అవుతున్నారు. అస‌లు షర్మిల మీద ఇలాంటి జోకులు ప్రసారం కాకుండా చూడాలని కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైన ష‌ర్మిల డైలాగ్ ఫుల్ ఫేమ‌స్ కావ‌డం దీనిని ఇప్పుడు సినీ, రాజ‌కీయాల‌కి సంబంధించిన వారు కూడా వాడ‌డం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...