Home Film News Mega Family: మెగా కుటుంబీకులు చేసిన త‌ప్పు వ‌ల్ల‌నే నిహారిక‌కి విడాకుల‌య్యాయా..!
Film News

Mega Family: మెగా కుటుంబీకులు చేసిన త‌ప్పు వ‌ల్ల‌నే నిహారిక‌కి విడాకుల‌య్యాయా..!

Mega Family: గ‌త వారం రోజులుగా నిహారిక పేరు ఇంటర్నెట్‌లో తెగ నానుతూ వ‌స్తుంది. అందుకు కార‌ణం పెళ్లైన మూడేళ్ల‌కే ఈ అమ్మడు విడాకులు తీసుకోవ‌డ‌మే. కొన్ని నెల‌లుగా నిహారిక విడాకుల‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేసిన కూడా ఎవ‌రు స్పందించ‌లేదు. ఎప్పుడైతే నిహారిక కూక‌ట్ ప‌ల్లి ఫ్యామిలీ కోర్టులో చేసుకున్న ద‌ర‌ఖాస్తు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేసిందో వెంట‌నే నిహారిక‌, చైత‌న్య‌లు త‌న సోష‌ల్ మీడియా ద్వారా విడాకుల‌ని అధికారికంగా ప్ర‌క‌టించి అంద‌రికి పెద్ద షాకిచ్చారు. ఎప్పుడైతే వీరు త‌మ విడాకులు ప్ర‌క‌టించారో అప్ప‌టి నుండి నిహారిక‌, చైత‌న్య‌ల పేరు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

అసలు నిహారిక‌, చైత‌న్య‌లు విడిపోవ‌డానికి కార‌ణం ఏంటి? అన్యోన్యంగా ఉన్న వీరిద్ద‌రి మ‌ధ్య ఎవ‌రైన చిచ్చు పెట్టారా, జాత‌కాల ప్ర‌భావం వ‌ల‌న విడిపోయారా? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు అంద‌రి మ‌దిలో మెదులుతున్నాయి. అయితే నిహారిక దంప‌తులు విడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మెగా ఫ్యామిలీ అంటూ కొత్త వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. సాధార‌ణంగా పెళ్లికి ముందు ఇద్దరి జాతకాలు చూపించి అవి కలిస్తేనే వివాహానికి కూడా సిద్ధమవుతారు. అలానే జాతకాల ఆధారంగా పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయిస్తారు. అయితే ఇప్ప‌టి కాలంలో సంప్రదాయాల క‌న్నా కూడా ఫోటోలు, వీడియోల‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పెట్టిన ముహూర్తానికి పెళ్లి జ‌రిపించ‌డం లేదు.

జాతకం ప్రకారం పెట్టిన ముహూర్తానికి పెళ్లిళ్లు జ‌రిపించ‌క‌పోవడం వ‌ల‌న వైవాహిక జీవితంలో అనేక‌ ఒడిదుడుకులు ఏర్పడి విడిపోయే పరిస్థితిలు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది.నిహారిక వెంకట చైతన్య విషయంలో కూడా ఇదే జరిగిందని, పెట్టిన ముహుర్తానికి మెగా పెద్ద‌లు పెళ్లి జ‌రిపించ‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే నిహారిక దంప‌తుల జీవితంలో ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తింద‌ని అంటున్నారు. వారు విడిపోవ‌డానికి మెగా ఫ్యామిలీదే త‌ప్పు అన్న‌ట్టుగా ఎత్తి చూపిస్తున్నారు. ఏది ఏమైన ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడాకులు తీసుకోవ‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌నీసం మూడేళ్లు కూడా వీరిద్ద‌రు సంసారం చేయ‌కుండా ఇలా స‌ప‌రేట్ కావ‌డం ఏంట‌ని కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...