Home Film News Indraja: వారందరి ముందు వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్ర‌జ‌.. కార‌ణం ఏంటంటే!
Film News

Indraja: వారందరి ముందు వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్ర‌జ‌.. కార‌ణం ఏంటంటే!

Indraja: ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన ఇంద్ర‌జ ఇప్పుడు జ‌డ్జిగా స‌త్తా చాటుతుంది. అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో కూడా స‌పోర్టింగ్ రోల్స్ చేస్తుంది.హీరోయిన్‌గా ఫేడ్ ఔట్ అయిన త‌ర్వాత ఇంద్ర‌జ త‌న కెరీర్‌ని ప‌క్కాగా ప్లాన్ చేసుకొని ముందుకు సాగుతుంది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ఇంద్ర‌జ‌కి ఉన్న క్రేజ్ మాములుగా లేదు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి దూర‌మైన ఇంద్ర‌జ రీఎంట్రీలో జబర్థస్త్ లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది . ఇక అక్కడ నుండి ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

జబర్థస్త్ షోతో పాటు.. ఎక్స్ ట్రా జబర్థస్త్.. శ్రీదేవి డ్రామా కంపెనీ.. స్పెష‌ల్ ఈవెంట్స్ ఇలా ఏదైన స‌రే… ఇంద్ర‌జ త‌ప్ప‌క ఉండాల్సిందే. అప్పట్లో హీరోయిన్ గా ఇంద్ర‌జ‌ ఎంతటి క్రేజ్ దక్కించుకుందో, ఇప్పుడు అంతకుమించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి ఉంది. ఇంద్ర‌జ జ‌డ్జిగా ఉంటూనే అప్పుడ‌ప్పుడు త‌న డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్‌ల‌తో సంద‌డి చేస్తుంటుంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఇండిపెండెన్స్ డే ప్రోమా రాగా , ఇందులో ఇంద్ర‌జ క‌న్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడు న‌వ్వించే ఆమె ఇలా క‌న్నీరు పెట్టుకునే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు.

క్లాసికల్ డ్యాన్స్ వేసిన త‌ర్వాత త‌న‌కి ద‌క్కిన ప్ర‌శంస‌లు చూసి ఇంద్ర‌జ చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఇన్నాళ్ల త‌ర్వాత డ్యాన్స‌ర్‌గా త‌న‌కి వ‌స్తున్న అప్లాజ్ చూసి ఆనందభాష్పాలు కార్చేసింది. ఇన్ని రోజులు ఇది నేను మిస్ అయిపోయానా అంటూ.. గుక్క పెట్టి ఏడ్చేసింది ఇంద్ర‌జ‌. సాధార‌ణంగా ఒక కళాకారిణికి ఈ రకమైన భావోద్వేగం ఉండటం సహజం. కాగా, ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరు చూసి అక్క‌డ ఉన్నవారు కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది . ఈ ఎపిసోడ్ కోసం ఇంద్ర‌జ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో ఇంద్రజకి ఇప్పుడు సినిమా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ఏ న‌టి అయిన తన జీవితంలో ఎలాంటి సక్సెస్ అయితే కోరుకుంటుందో.. ఇంద్రజ ప్రస్తుతం అలాంటి ఫేజ్ లోనే ఉంది. ఇప్పుడు బుల్లితెర మహారాణిలా వెలిగిపోతున్న ఇంద్రజ రానున్న రోజుల‌లో మ‌రింత బిజీ కానుంద‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...