Home Film News Gundu Hanumantrao: గుండు హనుమంతరావు కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
Film News

Gundu Hanumantrao: గుండు హనుమంతరావు కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Gundu Hanumantrao: హనుమంతరావు.. ఆయన్ను గుండు హనుమంతరావు అంటేనే గుర్తు పడతారేమో. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ప్రేక్షకుల్ని అలరించారు. ఈవీవీ డైరెక్షన్ వహించిన ఆహా నా పెళ్లంట అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి గుండు హనుమంతరావును పరిచయం చేశారు. ఆ తర్వాత దాదాపు 600 పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా తన టాలెంట్ చూపించారు. అమృతం అనే సీరియల్ లో అంజి క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. ఇప్పటికీ కూడా ఈ సీరియల్ ను చాలామంది చూస్తూనే ఉంటారని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సీరియల్ లో ఆంజనేయులు అనే క్యారెక్టర్ తో గుండు హనుమంతరావు ఎంతగానో నటించి మెప్పించారు.

అయితే ఆయన 2018 లో అకస్మాత్తుగా హనుమంతరావు మరణించారు. ఒక్కసారి తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతో దు:ఖానికి గురైంది. ఆయన చనిపోయిన ఘటన యావత్ సినీ ప్రేక్షకులు, నటీనటుల్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. అయితే గుండు హనుమంతరావుకు ఒక కొడుకు ఉన్నారు. అతని పేరు ఆదిత్య. గుండు హనుమంతరావు అంటే ఆదిత్యకు ఎంతో ప్రాణం. అందుకే హనుమంతరావుకు ఆరోగ్యం బాలేనప్పుడు అన్నీ తానై చూసుకున్నాడు. నిజానికి గుండు హనుమంతరావు మరణంతో ఆదిత్య అనాధగా మిగిలారు. ఎందుకంటే చిన్నతనంలోనే సోదరి, తల్లి మరణించారు.

ఆ టైమ్ లోనే ఆదిత్యను కమెడియన్ బ్రహ్మానందం దత్తత తీసుకున్నారు. గుండు హనుమంతరావు తనకు తమ్ముడు లాంటి వాడని వారి కొడుకు, తనకు కొడుకు అని కనుక ఆదిత్య బాధ్యతలు కూడా తనవే అని చెప్పారు. జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకునే వరకు ఆదిత్య బాధ్యతలు తీసుకుంటానని బ్రహ్మానందం చెప్పారు. అయితే రీసెంట్ గా ఆదిత్యకు సంబంధించిన కొన్ని ఫోటోలు చూసి నెటిజన్లు సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. ఆదిత్య స్కిన్ టోన్ బావుందని.. చూడ్డానికి హీరోలా ఉన్నాడు.. ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా సెటిల్ అవ్వచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...