Home Film News యాత్ర 2లో జ‌గ‌న్‌గా అల‌రించిన జీవా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. జీవా తండ్రి పాపుల‌ర్ నిర్మాత అని మీకు తెలుసా?
Film NewsSpecial Looks

యాత్ర 2లో జ‌గ‌న్‌గా అల‌రించిన జీవా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. జీవా తండ్రి పాపుల‌ర్ నిర్మాత అని మీకు తెలుసా?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన యాత్ర సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మళయాళ స్టార్ మమ్ముట్టి న‌టించి మెప్పించారు. అయితే ఇటీవ‌ల ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2ను కూడా తెర‌కెక్కించారు. వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా యాత్ర 2ను తీశారు. ఈ చిత్రంలో మ‌మ్ముట్టి త‌న పాత్ర‌ను కొన‌సాగించ‌గా.. వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌ను త‌మిళ న‌టుడు జీవా చేశాడు. సినిమా ఫ‌లితం గురించి ప‌క్క‌న పెడితే జ‌గ‌న్ పాత్ర‌లో జీవా జీవించేశాడు. జ‌గ‌న్ హావ‌భావాల‌ను వెండితెరపై ఎంతో అద్భుతంగా ప‌ల‌కించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. దీంతో జీవా గురించి తెలుసుకునేందుకు చాలా మంది సినీ ప్రియులు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే జీవా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..?ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు..? అత‌ని తండ్రి ఎవ‌రు..? వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల గురించి ఇక్క‌డ‌ తెలుసుకుందాం.

Yatra Movie Review A Lost Opportunity, 44% OFF | vp1.in

జీవా అస‌లు పేరు అమర్ చౌదరి. 1984 జ‌న‌వ‌రి 4న చెన్నైలో జీవా జ‌న్మించాడు. ఆర్. బి. చౌదరి, మహ్జబీన్ దంప‌తుల‌కు జీవా నాలుగో సంతానం. ఆర్‌.బి. చౌద‌రి గారు ప్రముఖ సినీ నిర్మాత మ‌రియు సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ అధినేత‌. త‌న‌ బ్యాన‌ర్ లో ఆర్‌. బి. చౌద‌రి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, సంక్రాంతి, అందాల రాముడు వంటి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌ను ఆర్‌. బి. చౌద‌రి నిర్మించారు. ఆర్‌. బి. చౌద‌రికి న‌లుగురు కుమారులు. పెద్ద కుమారుడు బి.సురేష్ త‌మ హోమ్ బ్యాన‌ర్ సూపర్ గుడ్ ఫిలింస్ స‌హ యజమానిగా వ్యవహరిస్తున్నారు. రెండో కుమారుడు జీవన్ స్టీల్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్తగా రాణిస్తుంటే.. మూడో కుమారుడు జితిన్ రమేష్ తమిళ సినీరంగంలో న‌టుడిగా ఉన్నారు. నాలుగో కుమారుడే జీవా.

Tamil Actor Jeeva Son Photos

చిన్న‌త‌నం నుంచి సినిమా వాతావ‌ర‌ణంలో పెర‌గ‌డం వ‌ల్ల జీవా హీరో కావాల‌ని ఆశ‌ప‌డ్డాడు. 1991లో త‌న తండ్రి నిర్మించిన పెరుమ్ పుల్లి, చేరన్ పాండియన్ చిత్రాల‌తో చైల్డ్ ఆర్టిస్ట్ గా జీవా త‌న సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించాడు. 2003లో ఆసై ఆశయై త‌నే త‌మిళ చిత్రంతో జీవా హీరోగా మారాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడినా.. జీవా న‌ట‌న‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. జీవా రెండో సినిమా తిథికుధే. ఉదయ్ కిరణ్ యొక్క తెలుగు చిత్రం మనసంతా నువ్వేకి ఇది తమిళ రీమేక్. ఆర్‌. బి. చౌద‌రి తితికిధేను నిర్మించ‌గా.. త‌మిళ‌నాట ఈ చిత్రం విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత అమీర్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన క్రైమ్ థ్రిల్లర్ రామ్ సినిమా జీవాను హీరోగా నిల‌బెట్టింది. దాంతో జీవా వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అప్ప‌టి నుంచి హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

Actor Jeeva Family - Jiiva Family and Friends. Family , Actors HD wallpaper  | Pxfuel

ఈ, కీర్తి చక్ర, శివ మనసుల శక్తి, కో, నాన్బన్, నీతానే ఎన్ పొన్వసంతం, ఏటో వెళ్ళిపోయింది మనసు, ఎండ్రెండ్రుం పున్నాగై త‌దిత‌ర‌ సినిమాలు జీవా కెరీర్ లో మంచి విజ‌యం సాధించాయి. 2011లో వ‌చ్చిన కో సినిమాను తెలుగులో రంగం పేరుతో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు. రంగం తెలుగులోనూ మంచి విజ‌యం సాధించింది. ఆపై నాన్బన్ చిత్రాన్ని స్నేహితుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్, జీవా, శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. రంగం, స్నేహితుడు సినిమాల ద్వారా జీవా తెలుగు వారికి ఎంత‌గానో చేర‌వ‌య్యాడు. 2023లో కస్టడీ మూవీతో జీవా నేరుగా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇందులో నాగ చైత‌న్య అన్న‌గా న‌టించి మెప్పించారు. ఇటీవ‌ల యాత్ర 2తో మ‌రో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేశాడు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Jiiva : వైఎస్ జగన్ లాగే కనిపించడానికి రీసెర్చ్ చేశాను.. ప్రతిపక్షం నుంచి  బెదిరింపు కాల్స్ వచ్చాయా అని మమ్ముట్టి గారిని అడిగితే.. | Hero jiiva speaks  ...

ప్ర‌స్తుతం త‌మిళంలో ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న జీవా.. త‌న సుధీర్గ సినీ ప్రయాణంలో ఉత్తమ నటుడుగా చాలా అవార్డుల‌ను గెలుచుకున్నాడు. మ‌రోవైపు స్టార్ విజయ్ టీవీలోని జోడి నెంబర్ వన్ డాన్స్ కాంపిటీషన్ మూడో సీజన్ లో సంగీత, ఐశ్వర్య రజనీకాంత్ లతో కలసి జీవా న్యాయనిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాగే ఆహా తమిళంలో సర్కార్ విత్ జీవా సీజన్ 1కి హోస్ట్ చేసి ఆక‌ట్టుకున్నారు. ఇక ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. చాలా ఏళ్ల క్రిత‌మే జీవాకు వివాహం జ‌రిగింది. 2007 నవంబరు 21న ఢిల్లీకి చెందిన త‌న చిన్ననాటి స్నేహితురాలు సుప్రియను జీవా పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఎంబిఎ చదివిన సుప్రియ‌.. ప్ర‌స్తుతం ఇంటీరియర్ డిజైనర్ గా వ‌ర్క్ చేస్తున్నారు. 2010లో జీవా-సుప్రియ దంప‌తుల‌కు స్పర్శ్ అనే కుమారుడు జ‌న్మించారు. భార్య‌, కొడుకుతో చెన్నైలో జీవా నివాసం ఉంటున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...