Home Film News Anasuya: అన‌సూయ అంత‌లా ఏడ్వ‌డంపై అంద‌రు షాక్.. దాని వ‌ల్ల కాదు ఏడ్చిందంటూ క్లారిటీ
Film News

Anasuya: అన‌సూయ అంత‌లా ఏడ్వ‌డంపై అంద‌రు షాక్.. దాని వ‌ల్ల కాదు ఏడ్చిందంటూ క్లారిటీ

Anasuya: ఎప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టే అన‌సూయ రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియాలో వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో షేర్ చేసి దానికి జ‌త‌గా సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టింది. ఇలా అన‌సూయ ఏడ‌వ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగించింది. సోష‌ల్  మీడియాలో ఏర్ప‌డిన నెగెటివిటీ వ‌ల‌న అన‌సూయ అంత‌లా ఏడ్చిందేమోన‌ని కొంద‌రు అనుకున్నారు. ఇంకొంద‌రేమో సోష‌ల్ మీడియాలో అన‌సూయ‌కి చాలా నెగెటివిటీ ఏర్ప‌డిన నేప‌థ్యంలో సింపతీ కోసం ఇలాంటి వీడియో షేర్ చేసి ఉంటుంద‌ని కామెంట్ చేస్తూ ఆమెని తెగ ట్రోల్ చేశారు.అన‌సూయ ఎంత ఎమోష‌న‌ల్ అయిన కూడా అది బెడిసి కొట్టి విమ‌ర్శ‌ల పాలైంది. త‌న పోస్ట్ రాంగ్ వేలో పోతున్న నేప‌థ్యంలో మ‌రో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ‘అరేయ్ ఏంట్రా మీరంతా..ఆ అంటూ రెండు వీడియోలు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

వీడియోల‌లో అనసూయ మాట్లాడుతూ.. ఆ వీడియో పెట్టిన త‌ర్వాత నేను సంతోషంగా సెలూన్‌కి వెళ్లి ఫేషియ‌ల్ చేయించుకున్నాను.  సండే నాకు వ‌ర్కింగ్ డేనే. నేను అనుకున్న‌ట్టుగానే చాలా మంది ఆ వీడియో చూసి త‌ప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇంకొంద‌రు అర్ధం చేసుకున్నారు.  నేను సోషల్ మీడియా నెగిటివిటి వ‌ల్ల ఏడ‌వ‌డం అనేది అవాస్త‌వం.  సోషల్ మీడియా వల్ల నేను ఏడ్చే రకం కాదు. నెగిటివిటి ఉంటే నా ఫీలింగ్ కోపం తో వస్తుంది. ఏడుపుతో కాదు. నా పర్సనల్ లైఫ్ లో ఒక నిర్ణయం తీసుకున్నా. అందువల్ల ఏర్పడిన వీక్ మూమెంట్ లో ఏడ‌వాల్సి వ‌చ్చింది అని అన‌సూయ చెప్పుకొచ్చింది.

ఒక ప‌బ్లిక్ ఫిగ‌ర్ సోషల్ మీడియాలో  ఏడవడం కరెక్టేనా అని ఆలోచించే ఆ వీడియోని పెట్టాను. కానీ నేను ఒంటరి కాదు పర్వాలేదు అని భావించే అలా ఏడ్చినా వీడియో పోస్ట్ చేసిన‌ట్టు అన‌సూయ పేర్కొంది. అయితే మ‌రి సోష‌ల్ మీడియా నెగెటివిటీ వ‌ల‌న అన‌సూయ ఏడ‌వ‌లేదు, దేని వ‌ల‌న ఏడ్చింది అనే కార‌ణం మాత్రం చెప్ప‌లేదు. ఒక‌వేళ ఫ్యామిలీలో ఏమైన స‌మ‌స్య‌లు వ‌చ్చాయా అన్న యాంగిల్‌లో కొంద‌రు ఆలోచిస్తున్నారు. రానున్న రోజుల‌లో అయిన అన‌సూయ క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.   ఇక యాంక‌రింగ్‌కి దూర‌మైన అన‌సూయ‌కి రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు  నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. చివరగా రంగమార్తాండ , విమానం వంటి చిత్రాల‌లో క‌నిపించి అల‌రించింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...