Home Film News Heroes: తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కరే.. మ‌రి ఆ స్టార్ హీరోలు వీరే..
Film News

Heroes: తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కరే.. మ‌రి ఆ స్టార్ హీరోలు వీరే..

Heroes: తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయారు. అలాగే హీరోలు కూడా తమ వ్యక్తిగత జీవితంలో సెలెబ్రిటీలను కాకుండా ఇంట్లో చూసిన సంబంధాలను పెళ్లిళ్లు చేసుకుని.. పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయి.. మరో పెళ్లి చేసుకోవడం ఇలా చాలానే జరిగాయని చెప్పాలి. అలా మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తల్లులు వేరైనా.. తండ్రి మాత్రం ఒక్కరే ఉన్నవారు ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరు.. ఏంటి.. అనే ఆశక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్. వీరిద్దరూ కూడా నందమూరి వంశానికి చెందినవారే. నటుడు నందమూరి హరికృష్ణ కొడుకులు.

హరికృష్ణ తన మొదటి భార్య లక్ష్మీకి కళ్యాణ్ రామ్ జన్మించారు. ఆ తర్వాత హరికృష్ణ శాలినీ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు. వీరిద్దరూ ఏ పార్టీలకు, ఈవెంట్స్ కి వెళ్లినా.. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు సొంత అన్నదమ్ముల్లానే ఉంటారు. అంతే ప్రేమగా కొనసాగుతున్నారు. నెక్ట్స్ మంచు విష్ణు, మంచు మనోజ్.. మోహన్ బాబు కూడా మొదటి భార్యకు మంచు లక్ష్మీ, విష్ణులు జన్మించారు. కొన్ని కారణాలతో ఆయన మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నారు. తన రెండో భార్య నిర్మలాదేవికి మంచు మనోజ్ జన్మించారు. కానీ లక్ష్మీ, విష్ణు, మనోజ్ ఈ ముగ్గురు కూడా చాలా ఆప్యాయంగా ఉంటారు.

 

రీసెంట్ గా మంచు మనోజ్ రెండో పెళ్లిని దగ్గరుండి మరీ మంచు లక్ష్మీ ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. ఇక అక్కినేని వారసులు. నాగచైతన్య, అఖిల్. వీరిద్దరికీ కూడా తండ్రి ఒక్కరే.. కానీ తల్లులు వేరు. నాగార్జున మొదటి భార్యకు నాగచైతన్య జన్మించారు. కానీ వీరిద్దరికి విడాకులు అవ్వడంతో అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించారు. అలా తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే. కానీ అన్నదమ్ముల మధ్య ప్రేమ విషయంలో ఎలాంటి లోటు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...