Home Film News Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఎక్కువసార్లు తిరుమలకు వెళ్లడం వెనక. కారణం ఇదేనా?
Film News

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఎక్కువసార్లు తిరుమలకు వెళ్లడం వెనక. కారణం ఇదేనా?

Janhvi Kapoor: తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ అందరికీ తెలుసు. ఆమె బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ లోకి దేవర మూవీతో ఎంట్రీ ఇస్తుంది. రీసెంట్ గా వచ్చిన బవాల్ మూవీ కూడా హిట్ అయ్యింది. దీంతో అభిమానుల్లో తన క్రేజ్ కూడా పెరిగింది. ఈ క్రమంలో జాన్వీ కపూర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. తెలుగులో యాక్ట్ చేయడానికి జాన్వీ ఎంతో కష్టపడిందట. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా యాక్ట్ చేయాలని జాన్వీ కపూర్ ఎన్నో కోరుకుందట.

ఆమె అనుకున్నట్లే ప్రజంట్ దేవర లో యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ నుండి జాన్వీ కపూర్ కి చెందిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక జాన్వీ కపూర్ ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తుంది. ఇలా సంవత్సరంలో నాలుగు సార్లు తిరుపతికి చేరుకున్న జాన్వీ కపూర్ కు చెందిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఇన్నిసార్లు జాన్వీ తిరుపతి ఎందుకు వెళ్తుంది అని అందరూ ప్రశ్నిస్తున్నారు.

నిజానికి తిరుమల అంటే శ్రీదేవికి చాలా ఇష్టం. అందుకే తాను ఏ పని స్టార్ట్ చేసినా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయనకు ఆ విషయం గురించి ముందుగా చెప్పుకుని శ్రీదేవి ఆ పనిని మొదలు పెట్టేవారట. ఇదే విషయాన్ని తన కూతురికి చెప్పిందట. అలా తల్లికి మంచి జరిగిందని.. కనుక తను కూడా ఏ పని స్టార్ట్ చేసే ముందు అయినా సరే తప్పకుండా వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవడానికి వెళ్తుందట. దీంతో పాటు కొన్ని స్పెషల్ డేస్ లో కూడా జాన్వీ కపూర్ తిరుమలకు వెళ్తుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు జాన్వీ కపూర్ కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...