Home Film News Sudheer-Rashmi: సుధీర్‌తో ప్రేమాయ‌ణంపై నోరు విప్పిన ర‌ష్మీ.. గుట్టు ర‌ట్టు చేసిందిగా..!
Film News

Sudheer-Rashmi: సుధీర్‌తో ప్రేమాయ‌ణంపై నోరు విప్పిన ర‌ష్మీ.. గుట్టు ర‌ట్టు చేసిందిగా..!

Sudheer-Rashmi: బుల్లితెర‌పై క్రేజీ జంట అంటే వెంట‌నే గుర్తుకొచ్చేది సుధీర్- ర‌ష్మీ జంట గురించే. వీరిద్దరు క్యూట్ పెయిర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ నేప‌థ్యంలో ప‌లు షోల‌లో వీరిద్ద‌రికి పెళ్లిళ్లు కూడా చేశారు. ఒక్కోసారి ఆ ఫొటోలు, వీడియోలు చూసి చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అయ్యారు. అయితే సుధీర్, ర‌ష్మీ రియ‌ల్ లైఫ్‌లో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని, జంట మూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందని చాలా మంది భావించారు. ఆఫ్ స్క్రీన్ లోనూ, ఆన్ స్క్రీన్ లోనూ ఈ జోడీ బెస్ట్ జోడీ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్స్ ప‌లుమార్లు త‌మ అభిప్రాయాల‌ని తెలియ‌జేశారు. అయితే ఇటీవ‌ల సుడిగాలి సుధీర్ తన మరదలితో ఎంగేజ్మెంట్ జ‌రుపుకున్నాడ‌ని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నాడని కూడా జోరుగా ప్ర‌చారం జ‌రిగింది

మరోవైపు రష్మీ పెళ్లికి సంబంధించి కూడా గతంలో పలు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా సుధీర్-ర‌ష్మీల గురించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ర‌ష్మీ.. సుధీర్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు అత‌నితో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు హింట్ ఇచ్చింద‌ని చెప్పుకొస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రష్మీ యాంక‌ర్‌గా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈవారం ఎపిసోడ్ లో కొంద‌రు సీరియల్ నటీమణులు పాల్గొనగా వారు త‌మ పెళ్లిపై స్పందించారు. వీరితో పాటు యాంకర్ రష్మీ కూడా కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. ‘నాకు కాబోయే వాడు.. చెప్పిందే చేయాలి. చేసిందే చెప్పాలి’ అంటూ ఓ డైలాగ్ చెప్పుకొచ్చింది. దీంతో కొందరు అభిమానులు అప్పట్లో సుడిగాలి సుధీర్ ’హీరో’ అవుతా అంటూ డైలాగ్స్ చెప్ప‌గా, ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడుగా అంటూ రష్మీ కామెంట్లను సూచిస్తూ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు.. ఆమె కామెంట్స్ చూస్తే.. రష్మీ మనస్సులో సుడిగాలి సుధీర్ మాత్రమే ఉన్నాడని మరోసారి ఇలా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందని కొంద‌రు భావిస్తున్నారు. అయితే వీరిద్ద‌రు త‌మ మ‌ధ్య ఫ్రెండ్షిప్ మాత్ర‌మే ఉంద‌ని చెబుతున్నా కూడా వారు త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్నార‌ని కొంద‌రు నెటిజ‌న్స్ చెప్పుకొస్తున్నారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...