Home Film News Shooting: రామ్ చ‌ర‌ణ్ బ్రేక్ ముగిసింది.. అత‌ను షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్ కానున్నాడంటే..!
Film News

Shooting: రామ్ చ‌ర‌ణ్ బ్రేక్ ముగిసింది.. అత‌ను షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్ కానున్నాడంటే..!

Shooting: మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..ఉపాస‌న‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌లు లేరు. అనేక‌సార్లు పిల్ల‌ల‌ని ఎందుకు ప్లాన్ చేయ‌డం లేద‌ని వీరిద్ద‌రిని ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ ఎలాంటి సమాధానం ఉండేది కాదు. అయితే ఇటీవ‌ల ఉపాస‌న ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. తాము ఇద్ద‌రం లైఫ్‌లో సెటిల్ అయ్యాక ప్లాన్ చేయాల‌ని భావించాము అని పేర్కొంది. ఎట్ట‌కేల‌కు జూన్ 20న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పండంటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చారు. ఇక జూన్ 23న డిశ్చార్జ్ అయింది ఉపాస‌న. బిడ్డ పుట్టిన త‌ర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన రామ్ చ‌ర‌ణ్‌.. త‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ఉపాస‌న ప్రెగ్నెంట్ అని ఆమెకి తోడుగా ఉండాల‌ని రామ్ చ‌ర‌ణ్ షూటింగ్‌కి వెళ్ల‌డ‌మే మానేశాడు.  ఆస్కార్ అవార్డ్‌ వేడుకల తరువాత ఆయన షూటింగ్ స్పాట్ కు వెళ్లిన దాఖ‌లాలు లేవు. జూలైలో ఉపాస‌న బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంద‌ని, ఆగ‌స్ట్ నుండి షూటింగ్‌కి వెళ్ల‌వ‌చ్చ‌ని అనుకున్నారు. కాని జూన్‌లోనే ఉపాస‌న డెలివ‌రీ కావ‌డంతో  జూలై నుండి అత‌ను షూటింగ్‌లో పాల్గొనే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. శంక‌ర్ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి.. కొత్త సినిమా ప్రారంభించ‌డానికి ముందు కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకోవాలని ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌ చరణ్.  తాజా అప్‌డేట్‌ ప్రకారం జులైలో షూటింగ్‌లో జాయిన్ అయి వెంట‌వెంట‌నే ఈ చిత్రాన్ని పూర్తి చేసి 2024 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నార‌ట‌.

ట్రిపుల్ ఆర్ వంటి సూప‌ర్ హిట్  తరువాత రామ్ చరణ్ ఆచార్య చిత్రం తో భారీ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకోవాల‌ని అనుకుంటున్నాడు. రామ్ చ‌ర‌ణ్ 15వ చిత్రంగా ఈ మూవీ రూపొందుతుండ‌గా, ఇందులో  బాలీవుడ్ భామ కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చిత్రంలో  రాంచరణ్‌ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.   పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో శంక‌ర్ ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు.  అందాల భామ అంజ‌లి మ‌రో కీ రోల్‌లో నటిస్తుండగా విలన్ గా ఎస్‌జే సూర్య..ఇతర పాత్రల్లో శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, జ‌య‌రాయ్‌, సునీల్ ఇత‌ర కీల‌క పాత్రలలో న‌టిస్తున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...