Home Film News Ram Charan: కూతురికి నైట్ సెక్యూరిటీగా రామ్ చ‌ర‌ణ్ ఎవ‌రిని పెట్టారో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవ‌ల్సిందే..!
Film News

Ram Charan: కూతురికి నైట్ సెక్యూరిటీగా రామ్ చ‌ర‌ణ్ ఎవ‌రిని పెట్టారో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవ‌ల్సిందే..!

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు జూన్ 20న త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందిన విష‌యం తెలిసిందే. దాదాపు ప‌దకొండేళ్ల త‌ర్వాత వారికి పండంటి బిడ్డ పుట్ట‌డంతో మెగా అభిమానులతో పాటు వారి స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు ప్ర‌తి ఒక్క‌రు కూడా సంతోషం వ్య‌క్తం చేశారు. జూన్ 30న లలితా సహస్ర నామం పదాలు కలిసేలా తమ కూతురుకు క్లీంకార అని నామకరణం చేసిన విష‌యం విదిత‌మే. అయితే తన గారాల ప‌ట్టి విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తమ బిడ్డ ఆహ్లాదకర వాతావరణంలో పెర‌గాల‌ని భావించిన రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు ఒక ప్రత్యేక గదిని సిద్ధం చేశారు.. చిన్నారి పెరిగేందుకు అనువైన వాతావరణం ఉండేలా పిల్లలు కోరుకునే బొమ్మలతో గదిని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఫారెస్ట్‌ థీమ్‌లా అడవిలో ఉండే జంతువుల బొమ్మలు, చెట్లు ఉండే గదిని అందంగా డిజైన్‌ చేశారు.

రూమ్ లో వైట్‌ థీమ్‌లో సోఫాలు, మ్యాట్‌లు, టేబుల్స్‌ ఇలా మొత్తం ఆహ్లాదభరితంగా ఉండేలా గదిని ఏర్పాటుచేశారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పవిత్రా రాజారామ్‌ ఈ స్పెషల్ రూమ్‌ను డిజైన్ చేయ‌గా, దీనికి సంబంధించిన వీడియోని ఉపాస‌న ఇటీవ‌ల షేర్ చేసింది. ఇది నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇక రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు కూతురికి రాత్రి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశార‌ట‌. క్లీంకార బిగ్ బ్రదర్ ఇప్పుడు రాత్రిళ్లు చిన్నారిని కంటికి రెప్పాలా చూసుకుంటున్నారట‌. ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ దంపతులు స్వ‌యంగా తెలిపారు. అయితే రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కి క్లింకార అనే బిడ్డ మాత్ర‌మే ఉండ‌గా, ఈ బ్ర‌ద‌ర్ అనే డౌట్ మీకు రావ‌చ్చు.

రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల‌కి రైమ్‌ అనే చిన్న పెంపుడు కుక్క ఉన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా దీన్ని వీరు పెంచుకుంటుండ‌గా, దానిని తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికైన వెళుతున్న‌ప్పుడు కూడా దీనిని త‌న వెంట తీసుకెళుతుంటాడు. అయితే చిన్నారి క్లీంకారని రాత్రిళ్లు చూసుకునే బాధ్యతలు రైమ్‌కి అప్పగించారట. రాత్రి సమయంలో సోఫాపై నిల్చొని క్లీంకార పడుకున్న బెడ్‌ని చూస్తుంది రైమ్‌. దీన్ని ఫోటో తీసి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. `నా చెల్లెలు నైట్‌ డూటీపై ఓ కన్ను వేచి ఉన్నాను` అని క్యాప్షన్ గా రాసుకొచ్చారు.. రైమ్ కి ఇన్‌స్టా అకౌంట్ కూడా వీరు క్రియేట్ చేయ‌గా, అందులో తన భావాలను చెబుతున్నట్టుగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని నడిపిస్తున్నారు. ఇప్పుడు క్లింకారా గురించి ఇలా రాసుకురాగా, ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Related Articles

Игровые аппараты Pin-up casino на деньги

Игровые аппараты Pin-up casino на деньги

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...