Home Film News Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి పిలిచి రూ.5 ల‌క్ష‌లు ఇచ్చాడంటూ పోసాని షాకింగ్ కామెంట్స్
Film News

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి పిలిచి రూ.5 ల‌క్ష‌లు ఇచ్చాడంటూ పోసాని షాకింగ్ కామెంట్స్

Allu Arjun: ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి మెగా ఫ్యామిలీకి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తెగ తిట్టిపోస్తుండ‌గా, అదే ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. అయితే బ‌న్నీ గొప్పతనం గుర్తు చేస్తూ పోసాని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ‘అల్లు అర్జున్ ఎప్పటి నుంచో త‌న‌కు ఫ్రెండ్ అని చెప్పిన పోసాని ఒక‌సారి న‌న్ను టీ తాగడానికి ర‌మ్మ‌న్నారు. ఆ స‌మ‌యంలో ఎనవలప్ కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఏంటి బాబూ ఇదీ అంటే.. అది తీసి చూడ‌మంటే అందులో రూ.5 లక్షల చెక్ ఉంది. నేను వెల్ సెటిల్డ్ కదా.. నాకెందుకు ఇస్తున్నావ్ అని అడిగాను. అప్పుడు మీరు చాలా మందికి గుండె ఆపరేషన్లు చేయించారు.. ఈ రూ.5 లక్షలు కూడా మంచి పనికి వాడతారు అని ఇచ్చాను అని బ‌న్నీ అన్నార‌ట‌.

 

ఇక ఆ చెక్‌ని తాను మంచి ప‌నికే ఉప‌యోగించిన‌ట్టు పోసాని తెలియ‌జేశాడు . పదో తరగతి పాసయ్యి ఇక చదువుకునే స్తోమత లేక ఏదో ఒక పనిచేసుకుంటున్న ముగ్గురు పిల్ల‌ల గురించి తెలుసుకొని వారికిఒక్కొక్కరి చొప్పున లక్షన్నర చొప్పున చెక్కులు ఇచ్చాను. వ్యక్తిగత ఖర్చుల కోసం మరో రూ.10 వేలు చొప్పున ఇచ్చాను అని పోసాని అన్నారు. ఈ సాయం చేసినందుకు నాకు వాళ్లంతా ధన్యవాదాలు చెబుతుంటే వారా లైవ్‌కి పిలిపించి అల్లు అర్జున్‌కి చెప్పించాను తాను లైవ్‌లో అల్లు అర్జున్ చేసిన సాయం గురించి చెప్పడంతో అభిమానుల నుంచి అల్లు అర్జున్‌కి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ స‌మ‌యంలో పోసానిని మ‌ళ్లీ పిలిచార‌ట బ‌న్నీ.

ఏంటి సార్ ఇలా చేశారు అని బ‌న్నీ న‌న్ను అడిగితే.. అప్పుడు తాను ‘ఏవయ్యా.. సొమ్ము ఒకడిది సోకు ఒకడిదా? నువ్వు చెక్ ఇస్తే నేను సాయం చేసినట్టు నేను చాలా గొప్పోడిని అనిపించుకోవడం నాకు మింగుడుపడదయ్యా.. అందుకే నీ పేరు చెప్పాను’ అని బన్నీతో తాను అన్నట్టు పోసాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం పోసాని అల్లు అర్జున్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక బ‌న్నీ ఇటీవ‌ల నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకున్న విష‌యం విదిత‌మే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...