Home Film News Naresh: ప‌విత్ర ముందు న‌రేష్ ప‌రువు తీసిన హైప‌ర్ ఆది
Film News

Naresh: ప‌విత్ర ముందు న‌రేష్ ప‌రువు తీసిన హైప‌ర్ ఆది

Naresh: విజ‌య నిర్మ‌ల త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వి.కె. న‌రేష్ బాల‌నటుడిగా కూడా మంచి సినిమాలు చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న హీరోగా ఎదిగి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించారు. న‌రేష్‌కి ఫ్యామిలీ ఆడియ‌న్స్ నుండి కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. అయితే ఇప్పుడు స‌పోర్టింగ్ పాత్ర‌ల‌తో అల‌రిస్తున్న న‌రేష్ రాజ‌కీయాల్లోకి వెళ్లి త‌న అదృష్టం ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం కూడా చేశాడు. కాని అది క‌లిసి రాక‌పోవ‌టంతో ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే వి.కె.నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా, కార్య‌ద‌ర్శిగా కూడా ప‌ని చేసి కొంద‌రితో ప్ర‌శంస‌లు, మ‌రి కొంద‌రితో విమ‌ర్శ‌లు అందుకున్నాడు.

 

న‌రేష్ ఈ మ‌ధ్య త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో ఉంటున్నాడు. ప‌విత్ర లోకేష్‌తో స‌హ‌జీవ‌నంకి సంబంధించి ర‌మ్య‌ర‌ఘుప‌తి మండిప‌డ‌డంతో పాటు ఆయ‌న‌పై దాడికి కూడా ప్ర‌య‌త్నం చేసింది. ఈ ఇద్ద‌రు కూడా ఇటీవ‌ల ప‌బ్లిక్‌గా తిరుగుతూ, క‌లిసి సినిమాలు చేస్తూ అందులో లిప్ కిస్ లు ఇచ్చుకుంటూ తెగ ర‌చ్చ చేశారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌ల పేర్లు తెగ మారుమ్రోగిపోయాయి. అయితే నరేష్‌, ప‌విత్ర‌లు ఇద్ద‌రు కూడ ‘సామీ రారా’ అనే వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ కోసం వ‌చ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో హైపర్ ఆది, తదితర కమెడియన్స్ షోలో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు. ఈ క్ర‌మంలో హైపర్ ఆది.. పవిత్రా పక్కనే ఉన్నప్పటికీ ‘నాకు ఒక్క పెళ్లే అవ్వట్లేదు.. మీకు పెళ్లి, మళ్లీ పెళ్లి? ఎలా సార్’ అని న‌రేష్‌ని ప్ర‌శ్నించాడు.

అప్పుడు న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ న‌వ్వుతూ క‌నిపించ‌గా, దానికి వారు ఎలాంటి స‌మాధానం చెప్పారా అనేది హాట్ టాపిక్ అయింది. ఇక ఇదిలా ఉంటే సీనియర్ నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకొని హాట్ టాపిక్ అయ్యారు.. ఆయ‌న పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో నిత్యం ఏవో ఒక వార్తలు చ‌క్క‌ర్లు హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీను కుమార్తెను ముందుగా వివాహం చేసుకోగా, వారికి న‌వీన్ విజ‌య్ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. ఆమె నుండి విడిపోయాక త‌ర్వాత దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌న‌వ‌రాలు రేఖా సుప్రియ‌ను వివాహం చేసుకోగా, వారికి కొడుకు జ‌న్మించాడు. ఇక ఆమెతోను విడిపోయిన న‌రేష్ మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి సోద‌రుడి కుమార్తె అయిన ర‌మ్య ర‌ఘ‌ప‌తిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆమెతో ఫైట్ చేస్తున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...