Home Film News Kalyan Dev: క‌ళ్యాణ్ దేవ్ ప‌రిస్థితి ఏంటి ఇలా అయిపోయిందేంటి.. ఆమెని మ‌ర‌చిపోలేక‌పోతున్నాడుగా…!
Film News

Kalyan Dev: క‌ళ్యాణ్ దేవ్ ప‌రిస్థితి ఏంటి ఇలా అయిపోయిందేంటి.. ఆమెని మ‌ర‌చిపోలేక‌పోతున్నాడుగా…!

Kalyan Dev: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొద‌ట ఓ వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, కొన్నేళ్ల వైవాహిక బంధం త‌ర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. వారి వైవాహిక దాంప‌త్యంకి గుర్తుగా ఒక పాప కూడా ఉంది. ఇక విడాకుల త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తితో మెగా ఫ్యామిలీ పెళ్లి జ‌రిపించారు. కొన్నేళ్ల పాటు వీరు చాలా అన్యోన్యంగానే ఉన్నారు. కాని కొద్ది రోజులుగా వారు దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. ప‌లు విష‌యాల‌లో వీరిద్దరి మధ్య గొడవలు త‌లెత్తి అవి విడాకులు తీసుకునే వరకు వచ్చింది.  వీరిద్దరూ ఇప్పటికే విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారాలు కూడా సాగుతున్నాయి. కాని ఎవ‌రు స్పందించ‌డం లేదు.

గత రెండున్నర సంవత్సరాలుగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుండ‌గా,  కుమార్తె నవిష్కను శ్రీజ తన వద్దే ఉంచుకుంది. అయితే శ్రీజ‌ని వదిలేసిన బాధ క‌న్నా త‌న కూతురికి దూరంగా ఉంటున్న బాధ క‌ళ్యాణ్ దేవ్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తుంది. ఆ మ‌ధ్య క‌ళ్యాణ్ దేవ్.. త‌న కూతురితో దిగిన పిక్స్ షేర్ చేస్తూ.. వారంలో తనతో గడిపే ఆ 4 గంటలే ఆనంద క్షణాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌తోనే  వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని అందరు క‌న్‌ఫాం అయ్యారు. తండ్రిగా కళ్యాణ్ దేవ్ కు వారంలో నాలుగు గంటలు గడపడానికి  మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చినట్టుగా ఆ పోస్ట్ ద్వారా అర్ధ‌మైంది.

ఇక  క‌ళ్యాణ్ దేవ్ రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియాలో మ‌రో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టాడు.  మిస్ యు బేబీ అంటూ ఒక పోస్ట్ పెట్ట‌డంతో పాపం.. కూతురిని ఎంత మిస్ అవుతున్నాడో అని ప్ర‌తి ఒక్క‌రు భావిస్తున్నారు.  తాజాగా కళ్యాణ్ దేవ్ త‌ల్లి బర్త్ డే కాగా,  తన తల్లికి సోష‌ల్ మీడియా ద్వారా  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూనే తన కూతురు నవిష్కని మిస్ అవుతున్న‌ట్టుగా.. మిస్ యు మై బేబీ అంటూ పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇక క‌ళ్యాణ్ దేవ్ విష‌యానికి వ‌స్తే.. విజేత సినిమాతో వెండితెర‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాణ్ దేవ్.. ప్ర‌స్తుతానికి సినిమాల‌కి దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...