Home Film News Chiranjeevi: ఆ ప‌ని చేసినందుకు రామ్ చ‌ర‌ణ్‌ని బెల్ట్‌తో చిత‌క్కొట్టిన చిరంజీవి.. అంత త‌ప్పు ఏం చేశాడు..!
Film News

Chiranjeevi: ఆ ప‌ని చేసినందుకు రామ్ చ‌ర‌ణ్‌ని బెల్ట్‌తో చిత‌క్కొట్టిన చిరంజీవి.. అంత త‌ప్పు ఏం చేశాడు..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్వ‌యంకృషితో ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచారు. ఇప్పటికే కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నారు. త‌న న‌ట‌న‌, డ్యాన్స్‌తో ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి త‌న ఇంటి నుండి చాలా మంది హీరోల‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. అందులో చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఉన్నాడు.  చిరుత సినిమాతో ఇండ‌స్ట్రీకి  వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్‌.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌గా కూడా మారాడు. త‌న  సినిమా ఎంపిక విషయంలో చిరు సలహా  తీసుకుంటూ ఈ స్థాయికి ఎదిగాడు చ‌ర‌ణ్.

చిన్న‌ప్ప‌టి నుండి చ‌ర‌ణ్‌ని ఎంతో గారాబంగా పెంచాడు చిరంజీవి. ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. మెగాస్టార్ వారసుడిగా పుట్టిన రామ్ చ‌ర‌ణ్‌.. చిన్న‌ప్పటి నుండి చాలా ల‌గ్జ‌రీ లైఫ్ ను లీడ్ చేస్తూ వచ్చారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం రామ్ చ‌ర‌ణ్ ది. అయిన‌ప్ప‌టికీ  చిన్నప్పుడు ఆయ‌న‌ చేసిన పని వల్ల చిరు చేతిలో బాగానే త‌న్నులు తిన్నాడ‌ట‌. అందుకు కార‌ణం ఆయ‌న నోటి నుండి బూతులు రావ‌డ‌మే. ఓ రోజు రామ్ చరణ్   రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వస్తుండగా వారి ఇంటి గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ ఫైటింగ్ చేసుకుంటున్నార‌ట‌. వారు బూతులు తిట్టుకుంటూ నానా ర‌చ్చ చేశార‌ట‌.

అయితే రామ్ చ‌ర‌ణ్ వారు మాట్లాడుకున్న బూతులు అన్ని గుర్తు పెట్టుకొని నాగ‌బాబు ద‌గ్గ‌ర‌కి వచ్చి చెప్పాడ‌ట‌. దీంతో నాగ‌బాబు ఈ విష‌యాన్ని చిరంజీవికి చెప్పాడ‌ట‌. వెంట‌నే చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్ ని రూమ్‌లోకి తీసుకెళ్లి  బెల్ట్ పెట్టి కొట్టారట. అసలెప్పుడు త‌నయుడిపై చెయ్యి చేసుకొని చిరంజీవి రామ్ చరణ్ బూతులు మాట్లాడేసరికి మాత్రం  బెల్ట్ పెట్టి గ‌ట్టిగా కొట్టేశారట. ఆ స‌మ‌యంలో బాగా ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని రామ్ చరణ్  అన‌డంతో చిరు వదిలేశాడ‌ట‌. అయితే చిరు కూడా రామ్ చ‌ర‌ణ్ ని అంత‌లా కొట్టినందుకు చాలా బాధ‌ప‌డ్డాడ‌ట‌.  కొడుకు మంచి కోసమే చిరంజీవి కొట్టాడు, ఆయ‌నకి త‌న‌యుడు అంటే చాలా ప్రేమ ఉంటుంద‌ని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Cómo apostar al tenis mexicano Pin Up

Cómo apostar al tenis mexicano Pin Up

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...