Home Film News Brahmanandam: ప‌వ‌న్ క‌ళ్యాణ్ దైవాంశ సంభూతుడు.. ఆయ‌న న‌వ్వు పత్తికాయ‌లా…
Film News

Brahmanandam: ప‌వ‌న్ క‌ళ్యాణ్ దైవాంశ సంభూతుడు.. ఆయ‌న న‌వ్వు పత్తికాయ‌లా…

Brahmanandam: ప‌వన్ క‌ళ్యాణ్, ఆయ‌న మేనల్లుడు సాయి ధరమ్ తేజ్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కించిన చిత్రం బ్రో. ఈ చిత్రం  తమిళ హిట్ ‘వినోదయ సీతం’ ఆధారంగా రూపొంద‌గా,  ఈ చిత్రానికి  టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. తమన్ సంగీత దర్శకుడిగా ప‌ని చేశారు.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జూలై 28న  థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రంలో సాయి తేజ్ జోడీగా కేతికా శర్మ, కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. మూవీ రిలీజ్ కి అతి త‌క్కువ స‌మ‌యం ఉండ‌డంతో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ క్ర‌మంలో మూవీ  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంకి వ‌చ్చిన సినీ ప్ర‌ముఖులు అంద‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ నేప‌థ్యంలో క‌మెడీయ‌న్ బ్ర‌హ్మానందం అయితే ఆకాశానికి ఎత్తేశారు. ‘మిస్టర్ బ్రో.. ఐ లవ్ యు బ్రో.. హేయ్.. దొంగ.. ఐ లవ్ యు.. ఐ లవ్ యు డా’ అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని పిలుస్తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెగ న‌వ్వేలా చేశారు బ్ర‌హ్మానందం. చిత్రంలో త‌న‌ది చిన్న క్యారెక్ట‌ర్ అని చెప్పిన ప‌వ‌న్ .. మూవీలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అదృష్టం క‌ల‌గ‌డం ఎంతో సంతోషంగా ఉంది. మీరంద‌రు చ‌ప్ప‌ట్లు కొట్ట‌డ‌మే కాకుండా ఆయ‌న‌కి అన్ని విధాలా తోడ్పాటునందించాల‌ని కోరుకుంటున్నాను అని బ్ర‌హ్మానందం అన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచిత‌నం గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ఆ న‌వ్వు మీరు ప‌లు సంద‌ర్భాల‌లో చూసి ఉంటారు.   పత్తికాయ పగిలినప్పుడు.. తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు.. ఆ తెల్లదనంలో ఎంతట స్పష్టత ఉంటుందో.. ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో.. అంత అందంగా నవ్వి, నవ్వించగలిగిన మనిషి. మనిషి చూడడానికి అలా సీరియస్‌గా ఉంటాడు కానీ.. మనిషంతా నవ్వు, మనిషంతా మంచితనం, మనిషంతా హాస్యం, కావాలనుకునేవాళ్లు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకంగా దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్ అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు.

అయ‌తే బ్ర‌హ్మ‌నందం నోటి నుండి  తెల్లటి పత్తి అని అనే మాట బ‌య‌ట‌కు రావ‌డంతో  ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ నవ్వేశారు. ప‌వ‌న్ ఈ రేంజ్‌లో న‌వ్వ‌డం చాలా రోజులైంద‌ని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌గా, బ్రో సినిమా కోసం ఆయ‌న 21 రోజుల పాటు డేట్స్ ఇచ్చార‌ట. 70 రోజుల పాటు షూటింగ్స్ చేయాల్సి ఉండ‌గా, కేవ‌లం 20 రోజుల‌లో పూర్తి చేశారు ప‌వ‌న్. సినిమా కోసం ప్ర‌తి ఒక్కరు చాలా నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేశారని, మూవీ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...