Home Film News Balayya Yuvasena : బాలయ్య జన్మదినం నాడు అభిమానుల రక్తదానం..
Film News

Balayya Yuvasena : బాలయ్య జన్మదినం నాడు అభిమానుల రక్తదానం..

Balayya Yuvasena: నటసింహా నందమూరి బాలకృష్ణ ‘జన్మదినం’.. అభిమానులకు ‘పర్వదినం’.. బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ‘బాలయ్య యువసేన’ (హైదరాబాద్) జూన్ 10న బాలయ్య 62వ పుట్టినరోజు నాడు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి (మే 28), వర్థంతి (జనవరి 18) తో పాటు బాలయ్య పుట్టినరోజు నాడు విధిగా రక్తదాన కార్యక్రమం చేపడుతుంటారు ‘బాలయ్య యువసేన’ టీమ్.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో.. ‘సేవ్ ఎ లైఫ్, గివ్ బ్లడ్’ అనే నినాదంతో ‘బాలయ్య యువసేన’ (హైదరాబాద్) ఆధ్వర్యంలో, జూన్ 10వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేయబోయే రక్తదాన శిబిరంలో అభిమానులంతా పాల్గొని బ్లడ్ డొనేట్ చెయ్యాలని టీమ్ మెంబర్స్ పవన్ మర్ని, పొట్లూరి రామకృష్ణ, పొట్లూరి రాజేష్, వినయ్ చావా తదితరులు పిలుపునిచ్చారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...