Home Film News Happy Birthday Movie : కిరాక్ కాన్సెప్ట్.. టీజర్ అదిరిందిగా..
Film News

Happy Birthday Movie : కిరాక్ కాన్సెప్ట్.. టీజర్ అదిరిందిగా..

Happy Birthday Movie: తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తూ, అతి తక్కువ టైంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా గుర్తింపు తెచ్చుకుని, కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమ అనుబంధ సంస్థ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి, క్రియేటివ్ కాన్సెప్టులతో, తక్కువ బడ్జెట్‌లో చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధిస్తుంది.

ఆ కోవలోనే ‘హ్యాపీ బర్త్‌డే’ అనే డిఫరెంట్ ఫిలిం చేస్తుంది. ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్న రితేష్ రానా డైరెక్ట్ చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

మంగళవారం (జూన్ 7) Happy Birthday Teaser రిలీజ్ చేశారు. గన్స్ గురించి ఈ కథ మొత్తం తిరుగుతుందని రివీల్ చేస్తూ కట్ చేసిన టీజర్ చాలా ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లావణ్యతో పాటు వెన్నెల కిషోర్, సత్య క్యారెక్టర్స్, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా హవా కొనసాగుతున్న తరుణంలో ఇది పూర్తి స్థాయి పాన్ తెలుగు మూవీ అని డిఫరెంట్ మూవీని అంతే డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు. జూలై 15న Happy Birthday Movie ఆడియన్స్ ముందుకి రాబోతుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...