Home Film News నారా రోహిత్ టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా!
Film News

నారా రోహిత్ టైటిల్‌తో ఎన్టీఆర్ సినిమా!

NTR - NARA ROHIT
NTR - NARA ROHIT

ప్రశాంత్ నీల్ పుట్టినరోజు (జూన్ 4) సందర్భంగా పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ప్రశాంత్ చేసిన ‘కె.జి.యఫ్ 1, కె.జి.యఫ్ 2’ సినిమాలు కన్నడ సినిమా ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించడమే కాక, కన్నడ సినిమా పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.

పార్ట్ 2 దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.. ఇటీవలే రికార్డ్ స్థాయి సెంటర్స్‌లో 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సినీ వర్గాలతో పాటు, యావత్ ప్రపంచ ప్రేక్షకుల చూపు ప్రశాంత్ నీల్, ప్రభాస్‌తో చేస్తున్న ‘సలార్’ మీదే ఉంది.

యంగ్ టైగర్ ఎన్టఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్ – ప్రశాంత్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ 31వ సినిమా ఇది.. బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన ప్రీ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయిందట..

‘అసుర’, లేదా ‘అసురుడు’ అనే రెండు పేర్లు అనుకుంటున్నారట. ‘అసుర అసుర రావణాసురా’ అంటూ ‘జై లవ కుశ’ మూవీలో అదరగొట్టాడు తారక్. ప్రశాంత నీల్‌తో చెయ్యబోయే సినిమా కోసం ఈ రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. 2015లో నారా రోహిత్ హీరోగా ‘అసుర’ పేరుతో ఓ సినిమా వచ్చింది. దీంతో తారక్ సినిమాకి, రోహిత్ టైటిల్‌ పెట్టబోతున్నారంటూ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...