Home Film News Ram Charan Bunny: రామ్ చ‌ర‌ణ్‌,బ‌న్నీకి గ్యాప్ వ‌చ్చిందా.. దీంతో వ‌చ్చేసిన ఫుల్ క్లారిటీ.!
Film News

Ram Charan Bunny: రామ్ చ‌ర‌ణ్‌,బ‌న్నీకి గ్యాప్ వ‌చ్చిందా.. దీంతో వ‌చ్చేసిన ఫుల్ క్లారిటీ.!

Ram Charan Bunny: ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందులో అల్లు ఫ్యామిలీ కూడా ఉండేది. కాని ఎప్పుడైతే బ‌న్నీ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతున్నాడో అప్పటి నుండి బ‌న్నీని మెగా ఫ్యామిలీ నుండి స‌ప‌రేట్‌గా చూస్తున్నారు. మెగా హీరోలంద‌రు ఓ లెక్క‌,  అల్లు అర్జున్ ఓ లెక్క అన్న‌ట్టుగా కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. అయితే  అల్లు అర్జున్ కూడా మెగా హీరో అనిపించుకోవడానికి ఇష్టపడటం లేదని.. అల్లువారి అబ్బాయిగా, అల్లు రామలింగయ్య మనవడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట‌ప‌డుతున్నాడ‌ని ఇటీవ‌ల బాగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ క్ర‌మంలోనే  అల్లు అర్జున్ ఆర్మీ, AA అనే సపరేట్ బ్రాండ్ లోగోల‌ని కూడా మెయింటైన్ చేస్తున్నాడ‌ని టాక్.

ఆ మ‌ధ్య  జ‌రిగిన‌ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి అల్లు అర్జున్ ని దూషించడంతో మెగా, అల్లు ఫ్యామిలీల మ‌ధ్య ఉన్న విభేదాలు నిజ‌మేన‌ని కొంద‌రు ఓ అభిప్రాయానికి వ‌చ్చారు. ఇక తాజాగా సంఘ‌ట‌న అభిమానుల అనుమానాల‌ని మ‌రింత రెట్టింపు చేసింది.  అల్లు అర్జున్ కి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్క‌డంతో చిత్ర పరిశ్రమతో పాటు మెగా హీరోలందరూ బెస్ట్ విషెస్ తెలియజేశారు కాని రామ్ చరణ్ మాత్రం కనీసం సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్ పెట్టలేదు.దీంతో అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్న స‌మ‌యంలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో  తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ 6 అవార్డ్స్ గెలవడాన్ని హైలెట్ చేశాడు, బన్నీకి ఏదో అంద‌రితో పాటు విష్ చేశాడు.

దీంతో రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంద‌ని, ఇందుకు సాక్ష్యం సోష‌ల్ మీడియాలో వారు చేస్తున్న పోస్ట్‌లు అని కొంద‌రు చెప్పుకొచ్చారు. అయితే చ‌ర‌ణ్‌, బ‌న్నీమ‌ధ్య విబేధాలు జోరుగా న‌డుస్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో బన్నీకి రామ్ చరణ్ దంపతులు స్పెషల్ గిఫ్ట్‌గా ఓ బొకేను పంపారు.. దానికి జ‌త‌గా ఓ స్పెషల్ నోట్‌ను కూడా జత చేశారు. అందులో   డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. ఇలాంటివి ఇంకా నీకు ఎన్నో సాధించాలి.. అవి సాధిస్తావు అన్నట్టుగా రాసుకొచ్చారు. ఇది చూసిన బన్నీ ఎమోషనల్ అవుతూ… థాంక్యూ సో మచ్.. టచ్ చేశారు అన్నట్టుగా రిప్లై ఇస్తూ చ‌ర‌ణ్ పంపిన బొకే పిక్‌ని  త‌న ఇన్‌స్టా స్టేట‌స్‌లో షేర్ చేశాడు. ఇది చూసి చాలా మంది   చెర్రీకి బన్నీకి గ్యాప్ ఉందని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వాలే అని కొట్టి ప‌డేస్తున్నారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...