Home Film News Heroine-Director: చీర పిన్ తీసేయమన్న డైరెక్టర్.. షాక్ కి గురైన స్టార్ నటి
Film News

Heroine-Director: చీర పిన్ తీసేయమన్న డైరెక్టర్.. షాక్ కి గురైన స్టార్ నటి

Heroine-Director: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎవర్ గ్రీన్ స్టార్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. హేమామాలిని అంటే ప్రతి ఒక్కరికి కలల రాకుమారిగా ఉండే వారు. అప్పట్లోనే బాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడిగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించారు. 1960 లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హేమమాలిని ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. 2004 లో బీజేపీలో చేరి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక సినిమాల్లో నటిస్తున్నప్పుడే ధర్మేంద్రను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

ఇక రీసెంట్ గా హేమమాలిని ఓ ఇంటర్వ్యూకి వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ మాటల వల్ల చాలా బాధపడ్డానని.. ఆ సమయంలో ఇబ్బందికి గురయ్యానని ఆనాటి సంగతులు చెప్పుకొచ్చారు. ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ తన చీరకు ఉన్న పిన్ ను తీసేయాలని చెప్పారని అన్నారు. ఆ టైమ్ లో ఆ మాట విన్నప్పుడు షాక్ అయ్యాయని అన్నారు. చీర పిన్ తీసేస్తే జారిపోతుంది కదా అన్నానని.. అప్పుడు డైరెక్టర్ మాకు అదే కదా కావాలి అని అన్నారని హేమమాలిని గుర్తు చేసుకున్నారు.

ఇక ఆ తర్వాత కూడా ఆయన మాటలకు కంగారు పడిపోయి భయపడ్డాను అంటూ హేమమాలిని వెల్లడించారు. అయితే ఆ డైరెక్టర్ పేరు గానీ, సినిమా గానీ హేమమాలిని బయటకు చెప్పలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నారు. ఇక హేమమాలినికి ఇద్దరు పిల్లలున్నారు. షోలే, సీత ఔర్ గీత లాంటి సినిమాలతో ధర్మేంద్రతో కలిసి యాక్ట్ చేశారు. ఇప్పటికీ హేమమాలిని ఎంతో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఆమె తన అభిమానులకు ఎప్పుడు చేరువగానే ఉంటారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...