Home Film News Tanzania Couple: ఆదిపురుష్ పాట ఆల‌పించిన టాంజానియా క‌పుల్స్.. స్పందించిన సింగ‌ర్
Film News

Tanzania Couple: ఆదిపురుష్ పాట ఆల‌పించిన టాంజానియా క‌పుల్స్.. స్పందించిన సింగ‌ర్

Tanzania Couple: బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు అన్ని భారీ బ‌డ్జెట్ చిత్రాలే చేస్తున్నాడు. ఆయ‌న సినిమాల‌పై దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఆదిపురుష్ చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జూన్ 16న విడుద‌ల కానుండ‌గా, మూవీపై అంద‌రిలో చాలా ఆస‌క్తి నెల‌కొంది. సినిమా కోసం మ‌న దేశంలోని సినీ ప్రేక్ష‌కులే కాక విదేశాల‌కి చెందిన సినీ ప్రియులు సైతం చాలా ఆస‌క్తిగా ఉన్నారు. సినిమా ట్రైల‌ర్, పాట‌లు ప్రేక్ష‌కులకి ఎంత‌గానో నచ్చేశాయి.సినిమా నుండి విడుద‌లైన  ప్రతీ ఒక్క అప్ డేట్ కూడా  ప్రపంచం దృష్టిని ఆక‌ర్షిస్తుంది..

ఈ నేప‌థ్యంలోనే  వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ యూ ట్యూబర్స్.. రీల్స్ స్పెషలిస్ట్ లు.. ఆదిపురుష్ నుంచి థిమ్ ను తీసుకుని ప‌లు వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. రీసెంట్‌గా  టాంజానియాకు చెందిన ఫేమస్ కంటెంట్ క్రియేటింగ్ కపుల్స్  కిలీపాల్ మరియు అతని సోదరి నీమా ఇద్దరు ఆదిపురుష్ రీల్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. టాంజానియా కంటెంట్ సృష్టికర్త కిలీ పాల్ మరియు అతని సోదరి నీమా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫుల్ ఫేమ‌స్ అయ్యారు. హిందీ సినిమా పాటలకు లిప్ సింక్ చేస్తూ.. డాన్స్ చేస్తూ.. వీడియోలు చేస్తూ కోట్ల మంది అభిమానులను సంపాదించారు.

హిందీకి సంబంధించిన  ఫేమస్ సాంగ్స్ అన్నింటిని వీడియోలు చేసిన ఈ జంట.. తాజాగా రిలీజ్ కు రెడీగా ఉన్న  ఆదిపురుష్’ నుండి ఒక ప్రముఖ పాటకు లిప్ సింక్ చేస్తూ వీడియో షేర్ చేశారు.  ‘రామ్ సియా రామ్ పాట‌ని అప్‌లోడ్ చేయ‌గా,  ఈ సాంగ్ చాలా తక్కువ టైమ్ లోనే 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అయితే వారి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ కాగా,  పాటను గానం చేసిన ప్ర‌ముఖ‌ గాయకుడు సుచేత్ టాండన్ స్పందించారు. . వావ్ అంటూ పొగుడుతూ  హార్ట్ సింబల్ పోస్ట్‌లో ఉంచాడు.  నెటిజన్స్ సైతం వీడియోపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు.  మా హృదయాలు దోచుకున్నారు అంటూ కామెంట్స్  చేస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...