Home Film News Keerthi Suresh: మాస్క్ పెట్టుకొని అర్ధరాత్రి టిఫిన్ సెంట‌ర్‌కి వెళ్లిన కీర్తి సురేష్‌.. ఆమెని గుర్తు ప‌ట్టారా..!
Film News

Keerthi Suresh: మాస్క్ పెట్టుకొని అర్ధరాత్రి టిఫిన్ సెంట‌ర్‌కి వెళ్లిన కీర్తి సురేష్‌.. ఆమెని గుర్తు ప‌ట్టారా..!

Keerthi Suresh: మ‌హాన‌టి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న అందాల న‌టి కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు మ‌హాన‌టి చిత్రంలో క‌న‌బ‌ర‌చిన న‌ట విన్యాసం ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ స్టార్ హీరోల‌కి జ‌త‌గా న‌టించింది.అలానే లేడి ఓరియెంటెడ్ సినిమాల‌లో కూడా ప్ర‌ధాన పాత్ర పోషించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్‌ ప్రస్తుతం తమిళ, మలయాళం, తెలుగు భాష‌ల‌లో వరుసగా చిత్రాలు చేస్తోంది. గత ఏడాది ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకుంది. ‘మహానటి’ తర్వాత కీర్తికి ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందించింది అనే చెప్పాలి.

స‌ర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్‌ తన నటనతో  ఆకట్టుకుంది. ఇక‌ ఈ ఏడాది ‘దసరా’అనే చిత్రంతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నానికి జోడిగా రెండోసారి నటించిన కీర్తికి ‘దసరా’ రూపంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ద‌క్కింది. ఇక ఈ అమ్మ‌డు ఉదయానిధి స్టాలిన్ జంటగా   ‘మామన్నన్’ అనే చిత్రంలో న‌టించింది. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.  రీసెంట్‌గా ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా  జ‌ర‌గ‌గా, ఆ ఈవెంట్‌లో కీర్తి  బ్లాక్ క‌ల‌ర్ శారీలో మెరిసింది. కీర్తి సురేష్ క్యూట్ లుక్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ నెల‌లోనే మామ‌న్న‌న్ అనే చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా కోసం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీ అయింది.

మ‌రోవైపు  కీర్తి తెలుగులో కీర్తి ‘భోళా శంకర్’అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో చిరంజీవి సోద‌రిగా క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. అయితే ఈ అమ్మ‌డు తాజాగా  గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లింది. అక్కడ అందరితో కలిసి టిఫిన్‌ చేసింది. అలాగే తందూరీ టీని కూడా టేస్ట్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ… ‘ఈవీకెండ్ ఎంతో అద్భుతంగా, సంతోషంగా గడిచింది’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే, త‌న‌ని బయటవాళ్లెవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధ‌రించింది కీర్తి సురేశ్‌. ప్రస్తుతం అయితే కీర్తి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ‌ వైరల్‌గా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...