Home Film News Adipurush: ఆదిపురుష్ మ‌రో కాంట్ర‌వ‌ర్సీ.. డ‌బ్బు కోస‌మే హ‌నుమంతునికి సీట్ వ‌దులుతున్నారా..!
Film News

Adipurush: ఆదిపురుష్ మ‌రో కాంట్ర‌వ‌ర్సీ.. డ‌బ్బు కోస‌మే హ‌నుమంతునికి సీట్ వ‌దులుతున్నారా..!

Adipurush: బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుండి భారీ బ‌డ్జెట్ చిత్రాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ఆదిపురుష్ జూన్ 16న విడుద‌ల కాబోతుంది.ఆదిపురుష్ రూపంలో వస్తున్న  రామ రావణ యుద్ధం ప్రేక్షకులను కనువిందు  చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా కోసం చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, వీడియోలు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఇక ఈ  చిత్రంలో  ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా రూపొందించారు.

ఆదిపురుష్   సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల చేయగా, ఇది సోషల్ మీడియాని షేక్ చేసింది. అన్ని భాషల్లో కూడా ఆదిపురుష్ ట్రైలర్ సెన్సేషన్ గా నిలిచింది. ఆదిపురుష్ ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. అయితే ఆదిపురుష్ చిత్ర యూనిట్‌పై కొందరు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌ల తిరుమ‌ల మాడ వీధుల్లో కృతి స‌న‌న్, ఓం రౌత్ ప్ర‌వ‌ర్త‌న‌ని త‌ప్పు ప‌ట్టారు.ఇక ద‌ర్శకుడు ఓం రౌత్ చిత్రాన్ని  సరిగ్గా తెరకెక్కించలేదని.. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు పాత్ర‌లు అంత ఒరిజినాలిటీగా లేవ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇక తాజాగా ద‌ర్శ‌కుడితో పాటు నిర్మాత‌ల‌పై విమ‌ర్శలు చేశారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఆంజనేయ స్వామి కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయిస్తామ‌ని అన్నారు. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడని ప్రతీతి ఉంది కాబ‌ట్టి ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నామ‌ని అన్నారు. అయితే  ఆదిపురుష్ చిత్ర యూనిట్ హనుమంతుడికి ప్రత్యేకంగా సీట్ కేటాయించేది భక్తితో కాదని.. డ‌బ్బు కోసం అని విమ‌ర్శ‌లు గుప్పించారు గాసిప్ రాయుళ్లు. హనుమంతుడికి కేటాయించిన సీట్ పక్క సీట్లకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబ‌ట్టి  ఆ సీట్  ధరల్ని అధిక మొత్తంలో పెంచి విక్రయించనున్నార‌ని అన్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ అవ‌న్నీ ఫేక్. త‌ప్పుడు వార్త‌లు న‌మ్మోద్దు . హనుమంతుడి  సీటు పక్క సీట్ల టికెట్ ధరలు కూడా సాధార‌ణంగానే ఉంటాయ‌ని అన్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...