Home Film News Allu Arjun – Trivikram: మ‌రోసారి అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ త్రివిక్ర‌మ్-బ‌న్నీ కాంబో..!
Film News

Allu Arjun – Trivikram: మ‌రోసారి అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ త్రివిక్ర‌మ్-బ‌న్నీ కాంబో..!

Allu Arjun – Trivikram: సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని కాంబినేష‌న్స్‌కి సూప‌ర్ క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుంది అంటే ప్రేక్ష‌కుల‌కి భారీ అంచ‌నాలు ఉంటాయి. అలాంటి కాంబో త్రివిక్రమ్- అల్లు అర్జున్‌ది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం చిత్రాలు ఎంత పెద్ద హిట్ కొట్టాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానుందంటూ ఇటీవ‌ల వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఆ సినిమా క‌న్నా ముందు వీరిద్ద‌రు ఆహా కోసం క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించి ఆహా బృందం కొద్ది సేప‌టి క్రితం అఫీషియ‌ల్ ప్ర‌క‌టన చేసింది.

ఆహా ఓటీటీ ఎప్పటికప్పుడు తెలుగులో దూసుకుపోతూ కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులని అల‌రిస్తూనే ఉంది. తాజాగా అల్లు అర్జున్ తో ఆహా కొత్తగా ఏదో ప్లాన్ చేయబోతుంది.తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్ స్పాట్ లో వారిద్దరూ ఉన్న ఓ ఫోటోని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అయితే ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండబోతుందని ప్రకటించడంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో పెద్దగా ఏం ప్లాన్ చేసి ఉంటారబ్బా అని జ‌నాలు ముచ్చ‌టించుకుంటున్నారు. వీరిద్ద‌రు క‌లిసి ఏదైనా షో ప్లాన్ చేస్తున్నారా? లేకా ఆహా కోసం యాడ్ చేస్తున్నారా? లేకపోతే ఏకంగా వెబ్ సిరీస్ చేస్తున్నారా..? అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు.

వీరిద్ద‌రి కాస్ట్యూమ్స్ ను బట్టి చూస్తుంటే ఇది యాడ్ ఫిల్మ్ అయ్యి ఉంటుందని అందరు అనుకుంటున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతుండగానే.. ఇప్పుడు బన్నీతో మరో ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రావడం ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...