Home Film News హనుమాన్ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై హనుమాన్ విశ్వరూపం…గూస్‌బంప్స్ గ్యారెంటీ..!
Film NewsReviews

హనుమాన్ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై హనుమాన్ విశ్వరూపం…గూస్‌బంప్స్ గ్యారెంటీ..!

విడుదల తేదీ : జనవరి 12, 2024
నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య
దర్శకుడు : ప్రశాంత్ వర్మ
నిర్మాత: నిరంజన్ రెడ్డి
సంగీత దర్శకులు: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: శివేంద్ర
ఎడిటింగ్: సాయిబాబు తలారి..

FL ప‌రిచ‌యం :

సూపర్ హీరోలు మన ప్రేక్షకులకు కొత్త కాదు. ఇప్పటి వరకు హాలీవుడ్ సూపర్ హీరోలను ఎక్కువగా చూశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ హీరో అంటే హిందీ హీరో, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘క్రిష్’ గుర్తుకు వస్తుంది. ఈ కొత్త సంవత్సరం మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ‌ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్. అయితే… దర్శకుడు ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో ‘హను మాన్’ తీశారు. ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుడిని స్క్రీన్ మీదకు తీసుకు వచ్చారు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Hanuman Twitter Review: 'హనుమాన్' ట్విట్టర్ రివ్యూ.. అదిరిపోయింది.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అంతే.. - Telugu News | Hanuman Movie Twitter Review in Telugu starrer Teja Sajja and Director ...

క‌థ‌ :

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఫిక్షనల్ సిటీ సౌర్యస్త్ర ప్రాంతానికి చెందిన మైఖేల్(వినయ్ రాయ్) అతను చిన్నప్పటి నుంచి సూపర్ హీరోస్ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటూ తాను కూడా సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. ఇక మరో పక్క అంజనాద్రి అనే ఓ చిన్న గ్రామంలో చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరిగా తిరిగే తుంటరి కుర్రోడు హనుమంతు(తేజ సజ్జ) అలా తిరుగుతున్న హనుమంతుకి కొన్ని అనుకోని పరిణామాల రీత్యా బజరంగబలి హనుమాన్ శక్తులని పొందుతాడు. ఇక మరి తాను ఆశక్తిని ఎలా పొందగలిగాడు..? అసలు ఆ శక్తి భూమి మీదకి ఎలా వచ్చింది..? ఈ శక్తిని పొందడం కోసం మైఖేల్ ఎందుకు వస్తాడు..? హనుమంతు- మైఖేల్ మధ్య యుద్ధం ఎలా ఉంటుంది..? వీటన్నిటికీ మన రామాయణ ఇతిహాసాల కనెక్షన్ ఎలా ఉంది.. అనేది తెలియాలంటే ఈ సినిమాని థియేటర్లో చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో అందరికీ తెలిసిన అతిపెద్ద మేజర్ ప్లస్ పాయింట్ ఏమిటంటే హనుమాన్.. ఆ పాయింట్ ని ఈ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలా హైలెట్ చేయాలో అలా చేసి బాగా చూపించాడు. అదేవిధంగా హీరో తేజ అయితే తన క్యారెక్టర్ కి ప్రాణం పెట్టి నటించాడు. అలాగే తన లుక్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ యాక్షన్ సహా ఎమోషనల్ పర్ఫామెన్స్ తో కూడా మెప్పించాడు.

ఇక హీరోయిన్ అమృత అయ్యర్ కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. హీరోతో ట్రావెల్ చేస్తూ బ్యూటిఫుల్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాకుండా హీరో అక్కగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా ఎంతో పవర్ఫుల్ గా కనిపించింది. అదేవిధంగా ఎంతో నేచురల్ గా తన నటనను కనబరిచింది. మరీ ముఖ్యంగా తేజాతో ఎమోషనల్ సీన్స్ తో ఇద్దరి నటన కొన్ని కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులకు ఎమోషనల్ గా కూడా తగులుతుంది.

హనుమాన్ బడ్జెట్ నిజంగా అంతేనా బాలీవుడ్‌ మేకర్స్ ఆశ్చర్యం - Teja Sajja Hanuman Movie Budget Issue

వీరందరితో పాటు మరో అగ్ర‌ నటుడు సముద్రఖని రోల్ అయితే సినిమాలోని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తనకి ఇచ్చిన క్యారెక్టర్ కి సముద్రఖ‌ని ఎంతో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అదేవిధంగా విలన్ గా వినయ్ రాయ్‌ కూడా స్టైలిష్ గా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ఇక వీరితో పాటు గెటప్ శీను, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్యా వారి పై కామెడీలు ఎంతో హైలైట్ గా నిలిచాయి.

వీటన్నిటిని మించి ఈ సినిమాలో అందరికీ గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్- సెకండ్ ఆఫ్ లో కూడా చాలా హై మూమెంట్స్ తో ప్రేక్షకులను అదరగొడతాయి. ముఖ్యంగా సినిమా క్లైమేక్స్ అయితే ఎవరు ఊహించిని విధంగా సినిమాకే హైలెట్గా నిలిచిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సన్నివేశాన్ని కచ్చితంగా ధియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన అంశం కూడా ఇదే.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కొన్ని లోటు పాట్లు కూడా ఉన్నాయి.. ఈ సినిమాని మన తెలుగు సూపర్ హీరోగా ప్రజెంట్ చేసినప్పటికీ కొన్ని సన్నివేశాలు కాస్త రెగ్యులర్ గానే అందరికీ అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్రలో వినయ్ పాత్రను ఇంకా పవర్ఫుల్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుంటుంది. అదేవిధంగా అతని పాత్రను మరి కాస్త డీటెయిల్ గా ప్రేక్షకులకు చూపించాల్సింది. ఇక తన పాత్రతో పాటుగా సినిమాల్లో కొన్నిచోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి.

HanuMan Movie Review: Pure Masterpiece

ఇక అదే విధంగా కొన్ని సన్నివేశాలకి మరింత బెటర్ గా విఎఫ్ఎక్స్ ని డిజైన్ చేసి తెరకెక్కించాల్సిందీ. ఇంకా ఈ సినిమాలోని ఫ్లాట్ కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు కానీ మనం ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కూడా కొంచెం స్టార్టింగ్ అయితే స్లోగా అనిపిస్తుంది కానీ తర్వాత ఓకే అనిపిస్తుంది. అదేవిధంగా యాక్షన్ సీక్వెన్స్ లో కొంచెం నేచురాలిటీ మిస్ అయింది. వీటితో ఒక కంప్లీట్ సూపర్ హీరో సినిమా చూస్తున్నట్టుగా అనిపించదు.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.. పెట్టిన బడ్జెట్ కి అయితే చాలా వరకు దర్శకుడు న్యాయం చేశాడు. వి ఎఫ్ ఎక్స్ మినహా మిగతా అన్ని క్రాఫ్ట్స్ లో నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వి ఎఫ్ ఎక్స్ చాలా చోట్ల ఎంతో నేచురల్ గా చూపించారు కానీ కొన్ని కొన్ని చాట్ల బడ్జెట్ మూలాన కొంత కాంప్రమైజ్ అయ్యారు. ఇక శివేంద్ర సినిమా ఆటోగ్రఫీ చాలాా బాగుంది.

ఇక గౌరీ హరీష్ సంగీతం సినిమాకే నెక్స్ట్ లెవెల్ గా ఉంది. ముఖ్యంగా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి వెన్నుముకగా నిలిచాడు. ఈ తరహా తెరకెక్కించిన సినిమాల్లో గతంలో రాజమౌళికి కీరవాణి సంగీతమ అందిస్తే ఎలా ఉంటుందో అలాగే ప్రశాంత్ శర్మ కి గౌరీ హరీష్ అదే లెవెల్ లో సంగీతం అందించినట్టు ఉంది. ఎడిటింగ్ డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికొస్తే తన విజన్ కి మాత్రం హాట్సాఫ్ అని చెప్పాల్సిందే.. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే సూపర్ హీరో జోనర్ అయినప్పటికీ కొన్ని సీన్స్ ని మనం ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చూసినవే చూపించాడు. కానీ ఎక్కడా తన ప్రస్తుత కాలానికి మన భారతీయ ఇతిహాసాలని జోడించడంలో మాత్రం తను సక్సెస్ అయ్యాడు.హనుమాన్ ఫ్యాక్టర్ని ఎలివేషన్ క్లైమాక్స్ పోర్షన్ ని ప్రజంట్ చేసిన విధానం చూస్తే రానున్న రోజుల్లో తన సినిమాలకు మరింత బడ్జెట్ ఇస్తే ఇంకా సాలిడ్ విజువల్స్ ఇస్తాడని చెప్పవచ్చు. కానీ ఇంకా కొన్ని లాజిక్స్ ని కరెక్ట్ చేసుకుని యాక్షన్ సీక్వెన్స్ లను మరింత న్యాచురల్ గా చూపిస్తే ఇంకా అద్భుతంగా ఉండేది.

హనుమాన్' మూవీ మొట్టమొదటి రివ్యూ..సంక్రాంతికి వార్ వన్ సైడ్ అయ్యినట్టే!

చివరగా :

సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హనుమాన్’. సూపర్ హీరో సినిమాలు అంటే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్లను ఎంటర్టైన్ చేసే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. క్లైమాక్స్ పదిహేను నిమిషాలు థియేటర్లు జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగుతాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసే చిత్రమిది. హనుమంతుడి ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ గ్యారంటీ.

ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే FL రేటింగ్- 3.25/5

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...