Home Film News Rakesh Master: ప్ర‌భాస్ వంటి స్టార్‌కి డ్యాన్స్ నేర్పించిన రాకేష్ మాస్ట‌ర్ ప‌రిస్థితి ఎందుకు ఇలా మారింది..!
Film News

Rakesh Master: ప్ర‌భాస్ వంటి స్టార్‌కి డ్యాన్స్ నేర్పించిన రాకేష్ మాస్ట‌ర్ ప‌రిస్థితి ఎందుకు ఇలా మారింది..!

Rakesh Master: ప్ర‌ముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ రాకేష్ మాస్ట‌ర్ ఆదివారం సాయంత్రం 5గం.ల స‌మ‌యంలో క‌న్నుమూసారు. స‌న్‌స్ట్రోక్ తో పాటు ఆయ‌న‌కి ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న నేప‌థ్యంలో కన్నుమూసారు. రాకేష్ మాస్ట‌ర్  మృతితో ఆయ‌న‌కు సంబంధించి అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. రాకేష్ మాస్ట‌ర్ అస‌లు పేరు రామారావు. అత‌ని అమ్మకి రాముడు, రామారావు అన్న చాలా ఇష్టం. అందుకే త‌న కొడుక్కి ఆ పేరు పెట్టుకుంది. మొత్తం వారు ఏడుగురు సంతానం కాగా, రాకేష్ మాస్ట‌ర్‌కి న‌లుగురు అక్క చెల్లెళ్లు ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఉన్నారు.  సినిమా అంటే ఎంతో పిచ్చి ఉండే రాకేష్ మాస్ట‌ర్ ఎన్నో క‌ష్టాలు ప‌డి టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్‌గా మారారు.

రాకేష్ మాస్ట‌ర్ చిన్నప్పటి నుండి చాలా ముక్కుసూటి మనిషి. నచ్చని విషయాన్ని ఏమాత్రం సహించేవాడు కాదట.  ఒకసారి వాళ్ళ అక్క పట్ల రిక్షావాడు తప్పుగా ప్రవర్తిస్తే వాడిని చిత‌క్కొట్టాడు.  ఇక సినిమాల‌పై ఉన్న పిచ్చితో శ‌వాల ముందు డ్యాన్స్‌లు చేసి వ‌చ్చిన చిల్ల‌ర‌తో కొత్త సినిమా చూసేవాడ‌ట‌. ఇక రామారావుకి జిమ్నాస్టిక్స్, కరాటే  అన్నా కూడా చాలా ఇష్ట‌మ‌ట‌. రామారావు డ్యాన్స్ చూసి అత‌ని త‌ల్లిదండ్రులే సినిమాల‌లోకి ప్రోత్స‌హించారు. అయితే  రాకేష్ మాస్ట‌ర్  టాలెంట్ గుర్తించిన ఓ వ్యక్తి సీనియర్ కొరియోగ్రాఫర్ ముక్కు రాజుకు పరిచయం చేయ‌గా, అత‌ను సాగ‌ర సంగ‌మంలోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ చూపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడ‌ట‌. అప్ప‌టి నుండి ముక్కురాజు త‌న శిష్యుల‌కి గురువుగా రామారావుని నియ‌మించాడు.

ప‌లు కార‌ణాల వల‌న చెన్నై నుండి హైదరాబాద్‌కి వ‌చ్చిన రాకేష్ మాస్ట‌ర్ ఓ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకున్నాడ‌ట‌.  ఈ డాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా అనతి కాలంలోఫుల్ పాపుల‌ర్ అయింది.  అయితే అప్పుడే  హీరోలుగా  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి  సిద్ధమవుతున్న ప్రభాస్, వేణు తొట్టెంపూడి.. రాకేష్ మాస్టర్ ద‌గ్గ‌ర డాన్స్ నేర్చుకున్నారట. వేణు త‌న తొలి చిత్రం చిరున‌వ్వుతోలో ఓ పాట‌కి కొరియోగ్రఫీ చేసే అవ‌కాశం ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఆయ‌న చాలా సినిమాలు చేశాడు. ఇండ‌స్ట్రీలో చాలా మంది రామారావు అనే పేరుతో కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉండగా, ఈయ‌న త‌న పేరుని రాకేష్ మాస్టర్ అని పేరు మార్చుకున్నాడట.  ఎదుటివారు ఎవరైనా నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టే మ‌న‌స్తత్వం కావ‌డంతో ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు.  డాన్స్ అసోసియేషన్ నుండి కూడా బ‌హిష్క‌రించ‌బ‌డ్డాడు. ఇప్పుడు యూట్యూబ్‌లో సంద‌డి చేస్తున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...