Home Film News Varun Tej-Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠిల వెడ్డింగ్ కార్డ్ ధ‌ర‌నా.. దాంతో ఐఫోన్ కొనుక్కోవ‌చ్చు..!
Film News

Varun Tej-Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠిల వెడ్డింగ్ కార్డ్ ధ‌ర‌నా.. దాంతో ఐఫోన్ కొనుక్కోవ‌చ్చు..!

Varun Tej-Lavanya Tripathi: మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, అందాల రాక్ష‌సి లావణ్య త్రిపాఠిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి కూడా రెడీ అయ్యారని వార్త‌లు రాగా, ఆ వార్త‌లు నిరాధార‌మే అని అంద‌రు అనుకున్నారు. కాని సైలెంట్‌గా ఈ జంట జూన్9న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని పెద్ద షాక్ ఇచ్చారు. చిరంజీవి ఫ్యామిలీ, రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీతో ఇలా మెగా ఫ్యామిలీ కుటుంబ స‌భ్యులు అంద‌రు వేడుక‌లో సంద‌డి చేశారు. అయితే ఈ ఏడాది చివ‌ర‌లో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ వేడుకని డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా జ‌ర‌పాల‌ని మెగా ఫ్యామిలీ భావిస్తుంద‌ట‌.

ఇటలీలో వ‌రుణ్ తేజ్ – లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక జ‌ర‌గ‌నున్నట్టు తెలుస్తుంది. అక్క‌డ పెళ్లి ఘ‌ట్టం ముగిసాక హైదారాబాద్‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో రిసెప్ష‌న్ వేడుక జరుపుకోనున్నారు. అయితే వీరిద్దరి వెడ్డింగ్ కార్డ్స్ కోసమే భారీగా ఖర్చు చేయబోతున్నట్టు ప్ర‌చారాం జ‌రుగుతుంది.. ఒక్కో వెడ్డింగ్ కార్డు కోసం దాదాపు 80 వేల వరకు నాగ‌బాబు ఫ్యామిలీ ఖ‌ర్చు చేయ‌నుంద‌ట‌. బంగారు పూతతో ఈ వెడ్డింగ్ ని కోటింగ్ చెసి ఉంటుంద‌ని, అందుకే ఒక్క వెడ్డింగ్ కార్డు కోసం 80 వేల వరకు ఖర్చు అవుతుంద‌ని అంటున్నారు.

వెడ్డింగ్ కార్డ్ కోస‌మే ఇంత ఖ‌ర్చు చేస్తున్నారంటే పెళ్లి ఏ రేంజ్ లో జరగబోతుందో అర్థం చేసుకోవచ్చు. నిశ్చితార్థ వేడుక రోజే పెళ్లి తేదితో పాటు వెన్యూ కూడా ఫిక్స్ అయింద‌ని అంటున్నారు. వాటి వివ‌రాలు ప్ర‌స్తుతానికి అయితే బ‌య‌ట‌కు రాలేదు. కాని ప‌లు ప్ర‌చారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇక లావ‌ణ్య త్రిపాఠి విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డికి ఇటీవ‌ల హిట్స్ పెద్ద‌గా లేదు. దీంతో సినిమాల స్పీడ్ త‌గ్గించింది. పెళ్లి త‌ర్వాత పూర్తిగా సినిమాలు మానేయ‌నుందని అంటున్నారు. ఇక వ‌రుణ్ తేజ్ విష‌యానికి వ‌స్తే సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...