Home Film News Heoines: బాల‌య్య సినిమా కోసం ఇద్ద‌రు హీరోయిన్స్‌ని అనీల్ రావిపూడి భ‌లే వాడేశాడు..!
Film News

Heoines: బాల‌య్య సినిమా కోసం ఇద్ద‌రు హీరోయిన్స్‌ని అనీల్ రావిపూడి భ‌లే వాడేశాడు..!

Heoines: వరుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నంద‌మూరి బాల‌కృష్ణ చివ‌రిగా వీర‌సింహారెడ్డి అనే చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. ఇక ఇప్పుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి భ‌గ‌వంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇటీవ‌ల ఓ చిన్న గ్లింప్స్ కూడా విడుద‌ల చేశారు. వాటికి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దసరాకి ఈసినిమా ఎలాగైనా రిలీజ్ చేయాలని భావించిన టీం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతుంది.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్  జ‌రుగుతుండగానే..మెగా డైరెక్టర్ బాబీతో  ఇటీవ‌ల ఓ సినిమా ఓపెనింగ్ కూడా చేసేశాడు బాలయ్య.

అయితే భ‌గ‌వంత్ కేస‌రి సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు అనీల్ రావిపూడి.ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొద‌లు ఏదో ఒక రకంగా చిత్రం గురించి న‌లుగురు మాట్లాడుకునేలా చేస్తున్నారు అనీల్ రావిపూడి.  ఆ మ‌ధ్య  సెట్‌లో అనీల్ రావిపూడి ఫైట్‌ మాస్టర్‌లతో కలిసి బాలయ్య సాంగ్‌కు స్టెప్పులేయ‌గా, అది సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. ఇక  ఇప్పుడు మరోసారి ఈ సెట్ లో హీరోయిన్స్  డాన్స్ పర్ఫామెన్స్ లతో దడదడలాడింది. చిత్రంలో  నటిస్తున్న తారలు.. కాజల్‌ అగర్వాల్, శ్రీలీల నరసింహ నాయుడు సినిమాలోని చిలకపచ్చ కోక పాటకు ఊర మాస్  స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు..

అయితే ఇందుకు సంబంధించిన వీడియోని త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అనీల్ రావిపూడి..  బాలకృష్ణ సాంగ్‌కు తాను వేసిన సెప్టులు చూసి ఈర్షపడ్డ ఇద్ద‌రు  హీరోయిన్స్ కాజల్, శ్రీలల ఇలా డ్యాన్సులు చేయకుండా ఉండలేకపోయారు అంటూ కామెంట్స్ చేశారు. బాలయ్య బాబు పాటలు అంటే మరి ఆ మాత్రం ఊపు లేకపోతే ఎట్టా అంటూ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట‌ ట్రెండింగ్ మారింది. ఇక ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ సంస్థ నిర్మిస్తుండ‌గా,  థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...