Home Film News NTR: బాబోయ్..5వేల కోట్ల‌తో ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి..!
Film NewsGossips

NTR: బాబోయ్..5వేల కోట్ల‌తో ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి..!

NTR: బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని  ఎల్ల‌లు దాటించిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో త‌న సినిమాకి ఆస్కార్ కూడా ద‌క్కేలా చేశాడు. ఇప్పుడు రాజ‌మౌళి సినిమా చేస్తున్నాడంటే దానిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తుంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జ‌క్క‌న్న మ‌హేష్ తో అడ్వెంచ‌రస్ మూవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారీ బ‌డ్జెట్ ఖ‌ర్చు చేస్తున్నాడు. విజువ‌ల్ వండ‌ర్‌గా మూవీని తెరకెక్కించే ఆలోచ‌న చేస్తున్నాడు. ఈ చిత్రంతో హాలీవుడ్‌లోను మ‌న తెలుగు సినిమా జెండా ఎగ‌ర‌వేస్తుంద‌ని రాజ‌మౌళి స‌న్నిహితులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్‌తో ఇప్ప‌టికే ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు చేసిన రాజ‌మౌళి 5వేల కోట్ల‌తో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

చివరిగా ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఆర్ఆర్ఆర్ సినిమా రావ‌డం జ‌రిగింది. అయితే అందులో ఎన్టీఆర్ పాత్ర.. రామ్ చరణ్ తో పోలిస్తే చాలా తగ్గిందని, సపోర్టింగ్ రోల్ లాగ అనిపించిందని ఫ్యాన్స్ చాలా ఫీల‌య్యారు. అందుకే ఎన్టీఆర్‌తో  పూర్తి స్థాయి సినిమా తియ్యాలని రాజమౌళి ని డిమాండ్ చేస్తున్నారు..వాస్తవానికి ఎన్టీఆర్ తో ‘గరుడ’ అనే చిత్రాన్ని తీయ‌డానికి రాజ‌మౌళి ఎప్ప‌టినుండో ప్లాన్స్ చేస్తున్నాడు. బ‌డ్జెట్  సరిపోక వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. అయితే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ వెయ్యి కోట్ల రూపాయిల రేంజ్ కి వెళ్లిన నేప‌థ్యంలో నిర్మాత‌లు కూడా భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేసేందుకు సై అంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి 5000 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ‘గరుడ చిత్రాన్ని రూపొందించ‌డానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయ‌బోయే సినిమాకి సంబంధించిన‌ స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో మూవీని సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది, ఈ చిత్రం పూర్తి అయినా వెంటనే ఎన్టీఆర్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యడానికి జ‌క్క‌న్న సిద్ధంగా ఉన్నాడ‌ట‌. దీనిపై త్వ‌ర‌లో అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని అంటున్నారు. నిజంగా ఎన్టీఆర్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో గ‌రుడ అనే సినిమా వ‌స్తే అది సెన్సేష‌న్ సృష్టించ‌డం ఖాయం.

Related Articles

బాలయ్య అఖండ2 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. !

నట‌సింహం నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా ఎలాంటి...

షాకింగ్ చిత్ర పరిశ్రమంలో విషాదం.. “మొగలిరేకులు, చక్రవాకం” సీరియల్ నటుడు కన్నుమూత..!

తెలుగు బుల్లితెరపై సంచలన విజయాలు అందుకున్న సీరియల్స్ లో రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన సీరియల్స్...

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...