Home Film News Keerthi: ద‌ర్శ‌కుడితో ఏడ‌డుగులు వేయ‌బోతున్న కీర్తి.. పిల్ల‌ల్ని క‌న‌లేన‌ని తెలిసినా.. అంటూ భావోద్వేగం
Film News

Keerthi: ద‌ర్శ‌కుడితో ఏడ‌డుగులు వేయ‌బోతున్న కీర్తి.. పిల్ల‌ల్ని క‌న‌లేన‌ని తెలిసినా.. అంటూ భావోద్వేగం

Keerthi: కొన్ని ప్రేమ‌ల‌కి లిమిట్స్ ఉండ‌వు. ఆస్తులు లేక‌పోయిన‌, చ‌దువు రాక‌పోయిన‌, బ‌ల‌గం పెద్ద‌గా లేకున్న స‌ద‌రు వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అలాంటి వారి ప్రేమ‌కి ఎన్ని మార్కులు వేసిన త‌క్కువే. ఆక‌లిస్తే అన్నం పెట్టే అమ్మ‌.. బాధ‌లు తీర్చే నాన్న‌.. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు త‌న వెన‌క నిలిచే అన్న‌.. అన్ని విష‌యాలలో చేదోడు వాదోడుగా ఉండే అక్క‌..క‌ష్ట‌న‌ష్టాల‌ని పంచుకునే సోద‌రి, సోద‌రులు క‌ళ్ల ముందే ర‌క్త‌పుటేరులో ప్రాణాన్ని వీడిపోతుంటే ఏ గుండె మాత్రం త‌ట్టుకుంటుంది. కాని ఆ బాధ‌ల‌ని దింగ‌మింగుకొని, ఎన్నో క‌ష్ట న‌ష్టాల‌ని ఎదుర్కొని ఇండ‌స్ట్రీలో ఓ స్థాయిలో నిల‌బ‌డింది కీర్తి.బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమ‌స్ అయిన కీర్తి మొద‌ట్లో ఎక్కువ‌గా సీరియ‌ల్స్ చేసింది.

అయితే బిగ్ బాస్ లో ఉన్న‌ప్పుడు కీర్తి త‌న తోటి స‌భ్యుల‌తో ఎన్నో బాధ‌లు చెప్పుకొని ఎమోష‌న‌ల్ అయింది. ఘోరమైన రోడ్డు ప్రమాదంలో అమ్మ, నాన్న, అన్న, వదిన ఇలా కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కీర్తి కొన్నాళ్ల‌పాటు కోమాలో ఉండి సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డింది. అయితే ఆ స‌మ‌యంలో   ఈమె పొట్టకు బలమైన గాయాలు కావ‌డంతో. ఆమె గర్భసంచి సైతం తీసేశారు. ఇక ఆమెను పిల్లలు పుట్టరని తెలిసి ఓ అమ్మాయిని ద‌త్త‌త తీసుకోగా ఆమె చ‌నిపోయింది. కీర్తి లైఫ్‌లో ఇంత విషాదం ఉండ‌గా, ఆమెతో జీవితాన్ని పంచుకోవ‌డానికి సిద్ద‌మయ్యాడు ఓ వ్య‌క్తి.  తల్లిదండ్రులు లేక‌పోయిన అంతకన్నా ప్రాణంగా ప్రేమించే అత్త‌మామ‌లు దొరికారు. వారంద‌రిని ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మైన షోలో ప‌రిచ‌యం చేసింది కీర్తి.  షోలో కీర్తికి నిశ్చితార్థం కాగా, ఆమెని పెళ్లి  చేసుకునే వ్య‌క్తి పేరు విజయ్ కార్తీక్ అని చెప్పింది.  చిత్తూరు మదనపల్లిలో పుట్టిపెరిగిన ఆయ‌న  ఉన్నత చదువులు కోసం  బెంగళూరు వెళ్లాడు. ఇక‌ సినిమాలపై ఉన్న ఆస‌క్తితో కన్నడ నాట కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు.

2014లో సేడు అనే మువీలో తొలిసారిగా హీరోగా నటించిన ఇత‌గాడు … కేజీఎఫ్‌ మువీ విడుదలకు ముందు రోజే త‌న  సినిమా రిలీజ్  చేశాడు. అప్పట్లో ఈ విష‌యం తెగ  హాట్‌టాపిక్‌ అయ్యింది. ఇక  పలుసినిమాల్లో నటించిన విజ‌య్ కార్తిక్‌ ‘ఏబీ పాజిటివ్’ అనే చిత్రంతో  దర్శకుడిగా కూడా మారారు. ఈయ‌న తెలుగు వారికి కూడా సుప‌రిచితం. టాలీవుడ్‌లోను ఓ వెబ్‌సిరీలో, ఏబీ పాజిటివ్, చెడ్డీగ్యాంగ్‌ అనే మూడు సినిమాల్లో నటించి అల‌రించాడు.. అన్‌లాక్ అనే  మువీ ప్రస్తుతం మేకింగ్‌లో ఉండ‌గా, త‌మిళంలో డార్క్‌ నైట్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే షోలో కీర్తి వారి ఫ్యామిలీని   నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లలేను అని చాలా ఎమోష‌న‌ల్‌గా చెప్పింది. అయితే త‌న అత్త‌మామ‌ల‌తో ఈ మాట అన్న‌ప్పుడు వారు.. నీకు పాప ఎందుకమ్మా నువ్వే మా పాప.. మనం అడాప్ట్ చేసుకుందాం లే అని అన్నారని చెప్పుకొచ్చింది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...