Home Film News Mahesh-Rajamouli: మ‌హేష్‌- రాజ‌మౌళి సినిమాకి ముహూర్తం కుదిరిందా..ఎప్పుడు ప్రారంభం కానుందంటే..!
Film News

Mahesh-Rajamouli: మ‌హేష్‌- రాజ‌మౌళి సినిమాకి ముహూర్తం కుదిరిందా..ఎప్పుడు ప్రారంభం కానుందంటే..!

Mahesh-Rajamouli: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సినిమాల విష‌యంలో పెద్ద‌గా హ‌డావిడి చేయ‌డు. చాలా సైలెంట్‌గా కూల్‌గా చేసుకుంటూ వెళ‌తాడు. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ సామాజిక నేప‌థ్యంలో ఎక్కువ‌గా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మాస్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. టైటిల్ కి, మ‌హేష్ లుక్‌కి ఫ్యాన్స్ నుంచి మంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌ర‌ప‌నున్న‌ట్టు టాక్.

గుంటూరు కారం సినిమా పూర్తైన త‌ర్వాత మ‌హేష్‌.. రాజ‌మౌళితో క‌లిసి భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు మొద‌లు కానుంద‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ త‌ర్వాత కొన్ని నెల‌ల పాటు ఆ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్ర‌మంలో రాజ‌మౌళి చాలా బిజీగా ఉన్నారు. దాంతో మహేష్ మూవీని ప‌ట్టించుకోలేదు. అయితే కొన్ని నెల‌ల కింద‌టే ఈ సినిమా స్క్రిప్టు ప‌నుల‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లు పెట్టారట‌. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న‌ పూర్తిగా ఆ ప్రాజెక్టు మీదే త‌న దృష్టిని కేంద్రీక‌రించిన‌ట్టు స‌మాచారం..

భారీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదికి తీసుకెళ్ల‌డానికి ఇంకా చాలా స‌మ‌య‌మే ప‌ట్టేలా క‌నిపిస్తుంది. అయితే ఈ చిత్రానికి ముహూర్త వేడుక‌ను మాత్రం త్వ‌ర‌లోనే నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. ఆగ‌స్టు 9న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు కాబ‌ట్టి, ఆ రోజు ఈ సినిమాకు ప్రారంభోత్స‌వం నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌. ఆ రోజు సినిమాకి లాంఛ‌నంగా ముహూర్త వేడుక నిర్వ‌హించి.. అనంత‌రం స్క్రిప్టు ప‌క్కాగా రెడీ అవ‌డంతో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులంతా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి వ‌చ్చే ఏడాది షూట్ మొద‌లుపెడ‌తార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే మ‌హేష్ కి ఓ సెంటిమెంట్ ఉంది. త‌న తన కొత్త సినిమాల ఓపెనింగ్స్ కి సాధార‌ణంగా హాజ‌రు కాడు. కాని రాజమౌళి సినిమా ఓపెనింగ్ కి మాత్రం ఆయ‌న వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...