Home Film News Manchu Lakshmi: న‌న్ను వాడుకొని మోసం చేశారు.. మంచు ల‌క్ష్మీ ఆవేద‌న‌
Film News

Manchu Lakshmi: న‌న్ను వాడుకొని మోసం చేశారు.. మంచు ల‌క్ష్మీ ఆవేద‌న‌

Manchu Lakshmi: మోహ‌న్ బాబు త‌న‌య‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మంచు ల‌క్ష్మీ న‌టిగా, నిర్మాత‌గా, హోస్ట్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. సోష‌ల్ స‌ర్వీస్ ద్వారా కూడా మంచు వార‌మ్మాయి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకుంది. అయితే మంచు ల‌క్ష్మీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌ను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మై కామెంట్స్ చేసింది. ఇన్నేళ్ల మీ ప్ర‌యాణంలో మిమ్మ‌ల్ని ఎవ‌రైనా మోసం చేశారా? అని అడ‌గ‌గా,నమ్మిన వాళ్లే త‌న‌ని మోసం చేశార‌ని చెప్పుకొచ్చింది మంచు ల‌క్ష్మీ. మోహన్ బాబు అమ్మాయి అయినప్పటికీ న‌న్ము మోసం చేశారు. అవి బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. నేను చెప్పడం వ‌ల‌న వారు ఫేమ‌స్ అవుతారు. తెలిసినవాళ్లు నన్ను వాడుకొని పైకి ఎదిగారు.

శ‌త్రువుల‌తో మ‌నం జాగ్ర‌త్త‌గానే ఉంటాం. న‌మ్మిన వాళ్లే మ‌న‌ల్ని బుట్ట‌లో వేసి మోసం చేస్తారు. ఆ స‌మ‌యంలో గుండె బ‌ద్ధ‌లైన‌ట్టు అనిపిస్తుంది.నేను చాలా బిజినెస్‌లు చేయ‌గా, కొంద‌రు న‌న్ను ప‌ట్ట‌ప‌గ‌లే దొంగ‌త‌నం చేసిన‌ట్టు చేశారు. 30 ఏళ్ల నుండి వాళ్లు నాకు తెలుసు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావ‌డంతో న‌న్ను ఎందుకు మోసం చేస్తార‌ని అనుకున్నాం. యూఎస్‌లో ఉన్న‌ప్పుడు ఇలాంటి స‌మస్య‌లు ఎదురు కాలేదు. అక్క‌డి వారు చాలా ఓపెన్‌గా ఉంటారు. ఇక్క‌డ మాత్రం చెప్పేది ఒక‌టి, చేసేది ఒక‌టి ఉంటుంది. ఇక్క‌డి ప‌ర్స‌న్స్ ని అంచ‌నా వేసేట‌ప్ప‌టికే ‘‘తూ నీ అ** బ‌తుకు అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది మంచు ల‌క్ష్మీ.

జీవితంలో సాధించ‌డానికి పుట్టామ‌ని ఎప్పుడు అనిపించిందంటే.. నా కూతురిని చేతుల్లోకి తీసుకున్న‌ప్పుడు అని పేర్కొంది. ఇప్పుడు పాపకి తొమ్మిది ఏళ్లు రాగా, నాకు కాస్త ఫ్రీడ‌మ్ వ‌చ్చింది. ఎక్క‌డికైన ఎగిరిపోగ‌ల‌ను. అదృష్టం ఉండి మ‌ళ్లీ హాలీవుడ్ లో అవకాశం వస్తే వెంటనే వెళ్ళిపోతా. ఇక్కడ ఎంత చేసిన గుర్తింపు రాదు కాబ‌ట్టి అక్క‌డే సినిమాలు చేసుకుంటాను. మన తెలుగు దర్శక, నిర్మాతలకి పక్క రాష్ట్రాల అమ్మాయిలే కావాలి క‌దా అని మంచు వార‌మ్మాయి తెలియ‌జేసింది. త‌ను నిర్మాత‌గా తెలుగు అమ్మాయిల‌తో సినిమా చేయాల‌న్నా కూడా ముందుగా తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచులు మారాల‌ని అంటుంది మంచు ల‌క్ష్మీ.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...