Home Film News Avinash: మ‌రో శుభ‌వార్త చెప్పిన ముక్కు అవినాష్‌.. ఇప్ప‌టి నుండే శుభాకాంక్ష‌ల వెల్లువ‌
Film News

Avinash: మ‌రో శుభ‌వార్త చెప్పిన ముక్కు అవినాష్‌.. ఇప్ప‌టి నుండే శుభాకాంక్ష‌ల వెల్లువ‌

Avinash: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో ముక్కు అవినాష్‌.ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ క‌మెడీయ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై కూడా సంద‌డి చేసిన అవినాష్ బిగ్ బాస్ షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లాడు.అక్క‌డ త‌న కామెడీతో ప్ర‌తి ఒక్క‌రిని న‌వ్వించాడు. జ‌బ‌ర్ధస్త్ షోని వ‌దిలేసి మ‌రి బిగ్ బాస్‌కి వెళ్లిన ముక్కు అవినాష్ ఆ షో ద్వారా చాలా పాపులారిటీ అయితే ద‌క్కించుకున్నాడు. ఇక కెరీర్‌లో మంచిగా సెటిల్ అయిన త‌ర్వాత 2021 అక్టోబ‌ర్‌లో అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం చాలా గ్రాండ్‌గానే జ‌రిగింది.

ఇక త‌న భార్యతో క‌లిసి ప‌లు ఈవెంట్స్ లో కూడా అవినాష్ సంద‌డి చేసేవాడు. అయితే ఈ జంట తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వ‌ర‌లోనే తాము త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని యూట్యూబ్ వేదిక‌గాచెప్పిన అవినాష్‌… త‌న‌ భార్య అనూజ ప్రెగ్నెంట్ అని,త్వ‌ర‌లోనే ఇంట్లోకి బాబు లేదా పాపాయి రాబోతుంద‌ని త‌లియ‌జేశాడు. పెళ్లై ఏడాన్న‌ర అవుతుండ‌గా, అక్టోబ‌ర్‌లో మా పెళ్లి రోజు ఉంది. ఇంకా పిల్ల‌ల‌ను ఎప్పుడు కంటారు అని మ‌మ్మ‌ల్ని ఎప్ప‌టి నుంచో అడుగుతుండ‌గా, దానికి ఇప్పుడు స‌మాధానం ఇచ్చామ‌ని అవినాష్ చెప్పుకొచ్చాడు.

ప్ర‌స్తుతం నా భార్య‌కి నాలుగో నెల‌. మూడు నెల‌ల వ‌ర‌కు డాక్ట‌ర్స్ ఎవ‌రికి చెప్పొద్దు అన‌డంతో కాస్త లేట్‌గా ఈ విష‌యాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ విష‌యం తెలిసి మా అమ్మానాన్న, అత్తామామాలు ఎంతో హ్యఫీగా ఫీలవుతున్నారు. నాలుగో నెలలో మా బిడ్డ గుండెచప్పుడు విన్న‌ప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాం అని చాలా సంతోష‌ప‌డుతున్నాడు అవినాష్‌. అయితే అవినాష్ షేర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ కావ‌డంతో అవినాష్ అభిమానులు,నెటిజన్స్, సెలబ్రెటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక అవినాష్ ప్ర‌స్తుతం స్టార్ మా రియాలిటీ షోస్‌తో బిజీగా ఉన్నారు. అత‌నికి మంచి మంచి సినిమా ఆఫ‌ర్స్ కూడా వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. ఏదేమైన అవినాష్ లైఫ్‌లో బాగానే సెటిల్ అయ్యాడు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...