Home Film News Sreeja: అది చేత కానప్పుడు వదిలేయ‌డ‌మే బెట‌ర్‌.. శ్రీజ భ‌ర్త షాకింగ్ కామెంట్
Film News

Sreeja: అది చేత కానప్పుడు వదిలేయ‌డ‌మే బెట‌ర్‌.. శ్రీజ భ‌ర్త షాకింగ్ కామెంట్

Sreeja: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెద్దగా మీడియాలో క‌నిపించ‌దు. పెద్ద కూత‌రు సుస్మిత అడ‌పాద‌డ‌పా అయిన క‌నిపిస్తుంది కాని శ్రీజ మాత్రం క‌నిపించ‌డం చాలా త‌క్కువ. అయితే ఈమె పేరు మాత్రం సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో మారుమ్రోగిపోతుంటుంది. మొద‌టి పెళ్లి సినిమా స్టైల్‌లో చేసుకున్న శ్రీజ అత‌నికి కొన్నాళ్ల‌కి విడాకులు ఇచ్చింది. ఈ జంటకి ఓ పాప ఉన్నారు. ఇక కొద్ది రోజుల‌కి క‌ళ్యాణ్ దేవ్ అనే వ్య‌క్తిని పెళ్లాడింది శ్రీజ‌. వీరి దాంప‌త్యంలోను ఓ పాప జ‌న్మించింది. అయితే కొద్ది రోజులుగా శ్రీజ‌.. క‌ళ్యాణ్ దేవ్‌కి దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. వారిద్ద‌రు విడాకులు కూడా తీసుకున్నార‌ని ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, దీనిపై ఎవ‌రు స్పందించ‌డం లేదు.

అయితే శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ మాత్రం అప్పుడ‌ప్పుడు తన సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టులను షేర్ చేస్తూ ఈ వార్తలకు  మరింత బలాన్ని చేకూరేలా చేస్తున్నాడు. ఇటీవల తన కూతురి  ఫోటోలను షేర్ చేసిన‌ కళ్యాణ్… వారానికి ఒక నాలుగు గంట‌లు త‌న‌తో పాటు ఉంటాన‌ని చెప్పాడు. ఇక  తాజాగా మరొక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేస్తూ .. ఇందులో ఓ ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టాడు. మ‌న జీవితంలో కొన్ని మ‌ర‌చిపోలేనివి ఉంటాయి. వాటిని వ‌దులుకునే ధైర్యం తెచ్చుకున్న‌ప్పుడు అవి మ‌న‌కు మ‌ధుర క్ష‌ణాలుగా మిగిలిపోతాయి. ఇప్పుడు నేను అదే చేస్తున్నా అంటూ క‌ళ్యాణ్ దేవ్ త‌న పోస్ట్‌లో తెలియ‌జేశాడు. అయితే ఈ పోస్ట్   శ్రేజని ఉద్దేశించి షేర్ చేశాడా అన్న అనుమానాలు  అంద‌రిలో క‌లుగుతుంది.

క‌ళ్యాణ్ దేవ్ పోస్ట్‌కి ప‌లువురు నెటిజ‌న్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి వ‌చ్చిన కూడా  ధైర్యంగా ఉండండి. ఉదయ్ కిరణ్ లాగా ఏమి చేయకండి, అంటూ ఓ నెటిజ‌న్‌ కామెంట్ చేశాడు. అందుకు కార‌ణం ఉదయ్ కిరణ్ మరణానికి మెగా ఫ్యామిలీ పరోక్షంగా కారణమనే వాదన ఎప్పటి నుండో ఉన్న విష‌యం తెలిసిందే.ఇక మెగా ఫ్యామిలీలో నిహారిక సైతం త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకుంద‌నే ప్ర‌చారం ఉంది. దీనిపై కూడా పూర్తి క్లారిటీ రావ‌డం లేదు.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...