Home Film News ‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ టీజర్ లాంచ్ చేసిన వివి. వినాయక్
Film News

‘రెడ్డి గారింట్లో రౌడీయిజం’ టీజర్ లాంచ్ చేసిన వివి. వినాయక్

Reddy Garintlo Rowdysim Teaser by VV Vinayak

కొరివి పిచ్చిరెడ్డి & సరస్వతి సమర్పిస్తూ, కె. రమణా రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఈ ఉదయం రిలీజ్ చేశారు. మాస్ డైరెక్టర్ వివి. వినాయక్ చేత టీజర్ రిలీజ్ చేయించడం జరిగింది. సినిమాలో రామన్ హీరోగా కనిపించబోతున్నాడు. కథ, దర్శకత్వ బాధ్యతలు ఎమ్. రమేష్ & గోపి.

‘లైఫ్ లో ఏదైనా సాధించినా, సాధించకపోయినా ప్రతి అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి రావడం పక్కా..’ అనేది సినిమాలో ఒక డైలాగ్. ఈ డైలాగ్ చెప్తూ.. తన జీవితంలోకి కచ్చితంగా వస్తుంది అనుకున్న అమ్మాయి నిజంగానే వచ్చినప్పుడు.. ఆ అమ్మాయితో ప్రేమని అంగీకరించని తండ్రి విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ చివర్లో.. పాకిస్తాన్ కి చెందిన షోయబ్ మాలిక్, సానియా మీర్జాని పెళ్లి చేసుకుంటే రాని సమస్య ఒక పేదవాడు ప్రేమిస్తే మాత్రం వస్తుందా అంటూ చెప్పే డైలాగ్ ని బట్టి ఈ కథ తన ప్రేమని గెలిపించుకునే అంశం చుట్టే ఉండేలా కనిపిస్తుంది. విలనేమో.. ఇద్దరిలో ఒకరిని చంపేస్తే ప్రేమ దానంతట అదే చనిపోతుంది అనే మనస్తత్వంలో ఉంటాడు.

ఇందులో నాయికలు వర్ష విశ్వనాథ్, పావని, ప్రియాంక, అంకిత, లావణ్యలు. పి. మధు కో-డైరెక్టర్ గా పనిచేశాడు. మ్యూజిక్ అందించింది మహిత్ నారాయణ్. ఏడిటర్లుగా శ్రీనివాస్ పి. మరియు సంజీవ రెడ్డి పనిచేశారు. వినోద్ కుమార్, మిర్చి మాధవి, రచ్చ రవి సహాయ నటులు. పూర్తి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...