Home Film News ‘బంగార్రాజు’కి అత్తగా జయప్రద?
Film News

‘బంగార్రాజు’కి అత్తగా జయప్రద?

Jayaprada in Bangarraju

సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగార్జున అభిమానులని కేరింతలు కొట్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ నాగార్జున కెరీర్ లో ఒకానొక బెస్ట్ గా నిలిచింది. డబుల్ ఆక్షన్ లో చేసిన ఆ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ నాగ్ కి జంటగా కనిపించడం కూడా ఒక ప్లస్ అయింది.

ఆ సినిమాలో నాగార్జున బంగార్రాజు పేరుతో కనిపిస్తాడు. ఇప్పుడు అదే టైటిల్ గా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, ఆ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణలు యధావిధిగా జంటగా కనిపిస్తూ ఉన్నప్పటికీ.. సినిమాకి మరింత మైలేజ్ తీసుకురావడం కోసం మరో పాపులర్ నటిని సినిమా టీమ్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.

ఐతే, ఈ అదనపు గ్లామర్ పాత్ర కోసం ఇప్పటికే తెలుగు ప్రజలకు బాగా పరిచయం అయిన జయప్రద గారిని పరిశీలిస్తున్నారు. కానీ.. నాగార్జునకి జయప్రద అత్తలా కనిపించడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అలాగే నాగచైతన్య కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జయప్రదకి సంబంధించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఐతే రాలేదు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...