Home Film News చైతన్య నెక్స్ట్ మూవీ ఈ డైరెక్టర్ తోనేనా?!
Film News

చైతన్య నెక్స్ట్ మూవీ ఈ డైరెక్టర్ తోనేనా?!

Chaitanya To Do a Film with Tirumala

రొమాంటిక్ డ్రామాతో రాబోతున్నాడు నాగచైతన్య. అలాగే అమీర్ ఖాన్ హిందీలో చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కూడా నాగ చైతన్య నటించబోతున్నాడు. ఆ సినిమా హాలీవుడ్ లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి ఇండియన్ వర్షన్. అందులో కూడా నాగ చైతన్య ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్న ఉత్సుకత అందరిలోనూ కనిపిస్తుంది. ఇది నాగ చైతన్యకి హిందీలో మొదటి సినిమా. అయితే ఈ సినిమాలో ముందుగా అవకాశం విజయ్ సేతుపతికి వచ్చింది. కానీ, విజయ్ ఆ రోల్ చేయకపోవడంతో ఆ అవకాశం చైతూకి దక్కింది.

ఐతే, నాగ చైతన్య చేయబోయే రొమాంటిక్ డ్రామా ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరనేది ఇప్పుడిప్పుడే తెరమీదకి వస్తుంది. ఆయన హిట్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఈ మూవీ అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న డీవీవీ దానయ్య ఈ సినిమాకి కూడా డబ్బులు పెట్టనున్నట్లు ఒక అంచనా. అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...