Home Film News Bro Movie: బ్రో చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ చెల్లిలిగా న‌టించిన అమ్మాయి గురించి తెలిస్తే అవాక్క‌వుతారు..!
Film News

Bro Movie: బ్రో చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ చెల్లిలిగా న‌టించిన అమ్మాయి గురించి తెలిస్తే అవాక్క‌వుతారు..!

Bro Movie: ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన సూప‌ర్ హిట్ చిత్రం బ్రో .ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. తమిళంలో సముద్రఖని, తంబిరామయ్య ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో రూపొందించారు. సినిమాకి కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబ‌డుతుంది. అయితే తొలి రోజుతో పోల్చితే మాత్రం రెండో రోజు డీలా పడ్డాడు బ్రో . ఈ సినిమాకు మంచి బుకింగ్స్ నమోదు కావడంతో ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.61 కోట్లు న‌మోదు కాగా, రెండో రోజు మాత్రం స‌గం మాత్ర‌మే రాబ‌ట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండో రోజు కేవ‌లం 10.47 కోట్లు రాబట్టింది బ్రో మూవీ.

మొత్తంగా ఈ రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ కలిపి చూస్తే 34.08 కోట్ల నెట్, 52.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెప్పుకొస్తున్నాయి. ఇక బ్రో చిత్రం రిలీజ్ అయిన త‌ర్వాత సినిమా గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బ్రో చిత్రంలో క‌థానాయిక‌లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ అనే ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఇక వీరితో పాటు చిత్రంలో మరో హీరోయిన్ కూడా సినిమాలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. సాయి ధ‌ర‌మ్ తేజ్ చెల్లిలిగా ప్రియాతో పాటు మ‌రో అమ్మాయి న‌టించింది. ఆమె ప్రియా క‌న్నా చాలా అందంగా ఉండ‌డంతో అంద‌రి దృష్టి ఆమెపై ప‌డింది.

తమిళంలో చాలా సూప‌ర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన యువ శ్రీలక్ష్మి అనే అమ్మాయి చిత్రంలో తేజ్ చెల్లెలిగా న‌టించింది. చిత్రంలో ఈ భామ నటన చూసిన చాలామంది తెలుగు జనాలు ఈమె ఎవరబ్బా అంటూ సెర్చ్ చేయడం ప్రారంభించారు. బ్రో సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించిన నేప‌థ్యంలో తమిళ హీరోయిన్ కి అవకాశంద ద‌క్కిన‌ట్టు చెబుతున్నారు. చిత్రంలో యుశ శ్రీ ల‌క్ష్మీ నటన చాలా బాగుండడంతో ఈమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతాయని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఏదేమైన బ్రో ద్వారా అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి రావ‌డం విశేషం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...