Home Film News Prabhas Anushka: క‌లిసి సంద‌డి చేయ‌నున్న ప్ర‌భాస్- అనుష్క‌.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్
Film News

Prabhas Anushka: క‌లిసి సంద‌డి చేయ‌నున్న ప్ర‌భాస్- అనుష్క‌.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్

Prabhas Anushka: ఆన్‌స్క్రీన్‌పై సంద‌డి చేసే కొన్ని క‌పుల్స్ ప్రేక్ష‌కుల‌కి అమితమైన వినోదం పంచుతూ ఉంటారు. వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు వెండితెర‌పై పంచే వినోదం ప్రేక్ష‌కుల‌కి ఎంతో వినోదం పంచుతూ ఉంటుంది. అందుకే వారి కాంబోని ఎన్ని సార్లైన వెండితెర‌పై చూసేందుకు ఆస‌క్తి చూపుతుంటారు. అలాంటి కాంబినేష‌న్‌లో ప్ర‌భాస్- అనుష్క జంట ఒక‌టి. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో  బిల్లా, మిర్చి, బాహూబలి సిరీస్ చిత్రాలు రూపొంద‌డగా, ఈ చిత్రాలు ఎన్ని రికార్డ్‌‌లు బద్దలు కొట్టాయో స్పెషల్‌‌‌గా చెప్పనవసరం లేదు. ఈ జంట‌కి టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బాహుబ‌లితో ఈ ఇద్ద‌రికి క్రేజ్ అమితంగా పెర‌గగా దానిని ప్ర‌భాస్ క్యాష్ చేసుకున్నాడు. కాని అనుష్క మాత్రం సైజ్ జీరో వంటి సినిమాలు చేసి కెరీర్‌ని ఇబ్బందుల్లో పెట్టుకుంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుండ‌గా, అనుష్క మాత్రం స్పీడ్ త‌గ్గించింది. అయితే ఈ ఇద్ద‌రి కాంబోలో మంచి మూవీ రావాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  అయితే ఇది జ‌ర‌గ‌డం చాలా క‌ష్ట‌మ‌ని వార్త‌లు వచ్చాయి. అందుకు కార‌ణం త్వ‌ర‌లోనే  అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుందట. అనుష్క‌సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుంద‌ని ప్ర‌చారం జ‌రిగిన నేప‌థ్యంలో మారుతి ఆమెని ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే అనుష్క గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, దీనిపై  అధికారికంగా ఇంక ప్రకటన రాలేదు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ – అనుష్క కాంబోలో ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ  పిరియాడికల్ మూవీ తీసేందుకు  కథను రెడీ చేశారట. బాహుబ‌లి నిర్మాత‌ల‌కి ఆయ‌న క‌థ‌ని వినిపించ‌గా, వారు కూడా ఆ చిత్రం చేసేందుకు ఆస‌క్తి చూపార‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్‌‌ను నిర్మించడానికి బాహుబ‌లి నిర్మాత‌లు ఎంతైన ఖర్చు చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి  వారు ముందుకొచ్చినట్టుగా సినీ వర్గాల్లో జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఒకవేళ  ఇదే నిజమైతే మరోసారి బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ – అనుష్క సంద‌డి ఓ రేంజ్‌లో ఉండ‌నుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...