Home Film News JrNTR: జూనియ‌ర్ ఎన్టీఆర్ సోద‌రిని ఆ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా..!
Film News

JrNTR: జూనియ‌ర్ ఎన్టీఆర్ సోద‌రిని ఆ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా..!

JrNTR: జూనియ‌ర్ ఎన్టీఆర్.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లోనే కాక దేశ వ్యాప్తంగా సుప‌రిచితం.  బాల‌నటుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత హీరోగా మంచి సినిమాలు చేశాడు.ఇటీవ‌ల వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.  ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌కి అన్ని భారీ ప్రాజెక్టులే వ‌స్తున్నాయి. అయితే  ఎన్టీఆర్‌కి సంబంధించి ఇటీవ‌ల ఎన్నో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ సోద‌రిని ఓ హీరో పెళ్లి చేసుకోనున్నాడ‌నే వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే ఇప్ప‌టి త‌రానికి వ‌డ్డే న‌వీన్ గురించి ప్రత్యేకంగా తెలిక‌పోవ‌చ్చు కాని పాత త‌రం వారికి మాత్రం వ‌డ్డే న‌వీన్ అంటే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు.

మంచి సినిమాలు చేసిన వ‌డ్డే న‌వీన్ కి రాను రాను ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో సినిమాల‌కి దూర‌మ‌య్యారు. అయితే ఆయ‌న ఎన్టీఆర్ ఫ్యామిలీతో బంధుత్వం కొన‌సాగించాడ‌ని చాలా మందికి తెలియ‌దు.   సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఈ ప్రేమ పెళ్లి విష‌యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ సాయం చేసాడ‌ని చాలా ప్ర‌చారాలు జ‌రుగుతున్నా కూడా ఇందులో ఎంత నిజం ఉంద‌నేది మాత్రం చాలా మందికి తెలియ‌దు.  వ‌రుస‌కు నవీన్, ఎన్టీఆర్ బావ బావమరుదులు అవుతారు. కాగా,  కొన్ని ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఒక‌ప్పుడు హీరోలుగా ప‌నిచేసిన చాలా మంది ఇప్పుడు  మిడిల్ ఏజ్ పాత్రలు చేస్తున్నారు. మిడిల్ ఏజ్ పాత్ర‌లు  చేసే నటులకు డిమాండ్ బాగా నడుస్తోంది. అయితే  నవీన్ వాటికి సరిపోవచ్చు కాని ఆ నాటి  తరానికి బాగా పరిచయం ఉన్న పేరు న‌వీన్‌ది కావటంతో ఆయ‌న ఏ సినిమా చేసిన కూడా అది అత‌నికి  ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు దర్శకులు నవీన్ ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన రీఎంట్రీ ఖాయం అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...