Home Film News GA2 Pictures : అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ సినిమా ప్రారంభం..
Film News

GA2 Pictures : అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ సినిమా ప్రారంభం..

GA2 Pictures
GA2 Pictures

GA2 Pictures: విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు నిర్మిస్తూ.. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజు పండగే’ లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ ‘పక్కా కమర్షియల్’ లాంటి కమర్షియల్ సినిమాతో మ‌రో మారు ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ కొత్త సినిమా ప్రారంభించింది.

‘జోహార్’, ‘అర్జున ఫల్గుణ’ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో సంచలన నిర్మాత బన్నీ వాస్ నిర్మాణంలో పూర్తిగా కథ ప్రధానంగా సాగే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టారు. నేడు హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు బన్నీ వాస్ త‌న‌య‌ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బ‌న్నివాసుతో పాటు విద్య మాధురి మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్ర‌తాప్ సహ నిర్మాత‌, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...