Home Film News Varalakshmi: ఆ నటిని అంత‌గా అవ‌మానించారా.. ఇన్నేళ్ల త‌ర్వాత ఆ విష‌యం చెప్పి షాకిచ్చిన వ‌ర‌ల‌క్ష్మీ
Film News

Varalakshmi: ఆ నటిని అంత‌గా అవ‌మానించారా.. ఇన్నేళ్ల త‌ర్వాత ఆ విష‌యం చెప్పి షాకిచ్చిన వ‌ర‌ల‌క్ష్మీ

Varalakshmi: త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్.. తెలుగు ప్రేక్ష‌కులకి కూడా చాలా సుప‌రిచితం. ఒక‌ప్పుడు ఆమె హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసింది. త‌ర్వాత స‌పోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల‌ని అల‌రిస్తుంది. తెలుగులో వ‌ర‌ల‌క్ష్మీ క్రాక్, నాంది, వీరసింహారెడ్డి చిత్రాల్లో లేడీ విలన్ పాత్ర పోషించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.ఈ సినిమా త‌ర్వాత వ‌ర‌ల‌క్ష్మీ.. లేడీ విలన్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇటీవ‌ల‌.. ఏజెంట్, మైఖేల్ వంటి చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించి అద‌ర‌గొట్టింది. వ‌ర‌ల‌క్ష్మీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది.

అంద‌రి మాదిరిగానే తాను కూడా కెరీర్ బిగినింగ్ లో ఇబ్బందులు, విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న‌ట్టు చెప్పుకొచ్చింది వ‌ర‌ల‌క్ష్మీ.  తన గొంతు కాస్త గంభీరంగా ఉండటంతో చాలా మంది వెక్కిరించారట. మీది మగాడి గొంతులా ఉంది, హీరోయిన్‌కి ఇలాంటి గొంతు కాదు ఉండేది అంటూ కామెంట్ చేశారట. అలా చాలా సార్లు హేళన చేసేవారని, కొన్ని సినిమాలకు తనను డబ్బింగ్ కూడా చెప్పనివ్వలేదని  వరలక్ష్మీ చెబుతూ బాధ‌ప‌డింది. అయితే ఇప్పుడు మాత్రం  పట్టుబట్టి  నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా..ఇప్పుడు నా న‌ట‌న‌నే కాదు  గొంతును కూడా అభిమానించే వాళ్లు పెరిగారు అని  చెప్పుకొచ్చింది వరలక్ష్మీ.

కొద్ది రోజుల క్రితం ఓ టీవీ షోలో పెళ్లిపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పెళ్లికంటే ముందు ఒక‌రినొక‌రు తామేంటో తెలుసుకోవాలని, ఆ తర్వాతే ఎదుటి వ్యక్తి మనల్ని ఎలా చూసుకుంటాడు, మనం అతడిని ఎలా చూసుకుంటాం అనేది అర్ధ‌మ‌వుతుంద‌ని వ‌ర‌ల‌క్ష్మీ పేర్కొంది. నేను హీరోయిన్ కావ‌డం మా నాన్న‌కు ఇష్టం లేదు. నేను ఏం సాధించిన క్రెడిట్ అంతా నాదే. ఒక‌ప్పుడు శ‌ర‌త్ కుమార్ కూతురుగా న‌న్ను పిలిచేవారు, ఇప్పుడు మాత్రం   వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్ అంటున్నారు అని  వ‌ర‌ల‌క్ష్మీ చాలా గ‌ర్వంగా చెప్పుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగు, త‌మిళ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...