Home Film News Tammareddy: ప్రభాస్ సినిమా తొలి రోజు రూ.600 కోట్లు వసూళ్లు రాబట్టడం ఖాయం.. తమ్మారెడ్డి కామెంట్స్
Film News

Tammareddy: ప్రభాస్ సినిమా తొలి రోజు రూ.600 కోట్లు వసూళ్లు రాబట్టడం ఖాయం.. తమ్మారెడ్డి కామెంట్స్

Tammareddy: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒక‌రైన ప్ర‌భాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కెరీర్‌లో విభిన్న క‌థా చిత్రాలు చేసి స్టార్ హీరోగా ఎదిగిన ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాలు ఆయ‌న‌కి దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగాను ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ రెండు సినిమాల‌తో ప్ర‌భాస్ కి జ‌పాన్‌లోను వీరాభిమానులు ఉన్నారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్.. సాహో, రాధే శ్యామ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ రెండు నిరాశ‌పరిచాయి. ఇక రీసెంట్‌గా వ‌చ్చిన ఆదిపురుష్ అయిన మంచి హిట్ కొడుతుందేమో అనుకుంటే అది కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. దీంతో స‌లార్, ప్రాజెక్ట్ కె చిత్రాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

తాజాగా ప్రాజెక్ట్ కె గురించి త‌మ్మారెడ్డి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. హాలీవుడ్ టాప్ చిత్రాల బాక్సాఫీసు కలెక్షన్లు రూ.20 నుంచి రూ.30 వేల కోట్ల పరిధిలో ఉన్నాయని.. ప్రాజెక్ట్ కె చిత్రానికి కూడా ఆ స్థాయి ఉంద‌ని త‌మ్మారెడ్డి అన్నారు. నేను ఆ మ‌ధ్య రెండు సార్లు ఈ మూవీ సెట్‌కి వెళ్లాను. చాలా బాగా తీస్తున్నారు. ఇక ప్ర‌చారం కూడా స‌రైన ప‌ద్దతిలో చేస్తే మూవీ గ్లోబ‌ల్ స్థాయికి చేరుకోవ‌డం ప‌క్కా.  వైజయంతీ మూవీస్  సరైన పద్ధతిలో ప్రచారం కల్పిస్తే ప్రాజెక్ట్ కె చిత్రం తొలి రోజు  రూ.500 నుంచి రూ.600 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందన్నారు. సినిమాని మంచిగా తీస్తే.. హాలీవుడ్ టాప్ సినిమాల జాబితాలో నిల‌వడం ఖాయం అని కూడా అన్నారు.

ఇక ఒక‌ప్పుడు ‘తెలుగులో రూ.30 కోట్లు, రూ.40 కోట్లు వస్తే చాలా ఎక్కువ అని భావించే వాళ్లం. కాని ఇప్పుడు ‘బాహుబలి’తో రూ.1000 కోట్లు చాలా ఈజీగా రాబట్టొచ‌ని నిరూపించాడు రాజమౌళి. ఇక ఆ తరవాత వ‌చ్చిన  ‘కె.జి.యఫ్’, ‘కె.జి.యఫ్ 2’, ‘RRR’ సినిమాలు కూడా మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి..  ఇప్పుడు ఈ సౌత్ సినిమాల క‌లెక్ష‌న్స్ చూశాక మ‌నం కూడా ప్ర‌పంచ స్థాయి సినిమాలు తీయ‌గ‌ల‌మ‌ని అర్ధ‌మ‌వుతుంది. ప్రాజెక్ట్ కెని క‌రెక్ట్‌గా చేస్తే మ‌నం  గ్లోబల్‌గా టాప్ 50లోకి వెళ్లినా  ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఈ చిత్రం 2024 స‌మ్మ‌ర్‌కి వ‌స్తుంద‌ని నేను అనుకుంటున్నాను అని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చెప్పుకొచ్చారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...