Home Film News Star Comedian: కూలీ ప‌నుల‌కి వెళ్లి.. ఇప్పుడు స్టార్ క‌మెడీయ‌న్‌గా..
Film News

Star Comedian: కూలీ ప‌నుల‌కి వెళ్లి.. ఇప్పుడు స్టార్ క‌మెడీయ‌న్‌గా..

Star Comedian: సినిమా సెల‌బ్రిటీలు చాలా చ‌క్క‌గా మేక‌ప్ వేసుకొని త‌మ హావ‌భావాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుంటారు.అయితే వెండితెర‌పై వినోదం అందించే వారి జీవితంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు కూడా ఉంటాయి. అవేమి మ‌న‌కు క‌నిపించ‌కుండా బాధ‌ని గుండెల్లో దాచుకొని సంద‌డి చేస్తుంటారు. అలాంటి వారిలో క‌మెడీయ‌న్ స‌త్య ఒక‌రు. ఇప్పుడున్న కమెడీయ‌న్స్ లో వెన్నెల కిశోర్ త‌ర్వాత చ‌క్క‌ని టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించే వారిలో సత్య ఉన్నారు.. స‌త్య స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆడియన్స్ మొఖంలో నవ్వు పూయ‌డం ఖాయం. పిల్ల జెమీందార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స‌త్య‌, ఛ‌లో సినిమాతో అందరికి ద‌గ్గ‌ర‌య్యాడు.

స‌త్య‌.. స్వామిరారా, దోచేయ్, సూర్య వర్సెస్ సూర్య, స్పీడున్నోడు, రంగస్థలం వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ద‌క్కించుకోగా, ఇటీవల విడుదలైన రంగబలి చిత్రంలో హీరో స్నేహితుడిగా కీలక రోల్ చేసి తెగ న‌వ్వించాడు. ఫ‌స్టాఫ్ మొత్తం కూడా స‌త్య కామెడీనే. సినిమాకి కాస్త నెగ‌టివ్ టాక్ వ‌చ్చిన కూడా స‌త్య కామెడీ కోసం ఒక్క‌సారైన సినిమా చూడొచ్చు అనే వాళ్లు కూడా ఉన్నారు. ఇక రంగబలి ప్రమోషన్స్ లో భాగంగా స‌త్య‌.. కొందరు జర్నలిస్ట్స్ ని ఇమిటేట్ చేస్తూ తెగ న‌వ్వించాడు. స‌త్య రూపం, ఆహార్యం, ముఖకవళికలు ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి.

 

అయితే స్టార్ క‌మెడీయ‌న్‌గా ఓ రేంజ్‌లో ఉన్న స‌త్య‌.. ఒక‌ప్పుడు చాలా క‌ష్టాలు ప‌డ్డాడ‌ట‌.. అమ‌లాపురంకి చెందిన స‌త్య‌.. కూలి ప‌నుల‌కి కూడా వెళ్లాడ‌ట‌. సినిమా అవ‌కాశాల కోసం హైద్రాబాద్ వ‌చ్చిన అత‌ను రోజూ ఏదో ఒక పని చేసుకుంటూ ఖాళీ స‌మ‌యంలో పాత్రల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడట. ఇక నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప‌ని చేసిన స‌త్య .. నిఖిల్ కళావర్ కింగ్ మూవీతో నటుడిగా వెండితెర ఆరంగేట్రం చేశాడు. కెరీర్ బిగినింగ్ లో ధన్ రాజ్ టీమ్ లో జబర్దస్త్ కమెడియన్ గా కూడా చేసి న‌వ్వించాడు. పిల్ల జ‌మీందార్ మూవీ స‌త్య కెరీర్‌కి ట‌ర్నింగ్‌గా మారింది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...