Home Film News Allu Arha: వామ్మో.. భ‌య‌పెట్టించేలా బ‌న్నీ కూతురు రెమ్యునరేషన్‌..నిర్మాత‌ల గుండెల్లో ద‌డ‌
Film News

Allu Arha: వామ్మో.. భ‌య‌పెట్టించేలా బ‌న్నీ కూతురు రెమ్యునరేషన్‌..నిర్మాత‌ల గుండెల్లో ద‌డ‌

Allu Arha: ఎక్క‌డైన పాత తరం పోవ‌డం, కొత్త త‌రం రావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సినిమా ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే వార‌సుల హ‌వా ఎక్కువ‌నే విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది వారసులుగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స‌త్తా చాటుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడు అకీరా, మ‌హేష్ త‌న‌య సితార‌, బ‌న్నీ కూతురు అర్హ వెండితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే అర్హ‌.. సమంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన శాకుంత‌లం చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఇందులో భ‌ర‌తుడిగా అర్హ క‌న‌బ‌ర‌చిన హావ‌భావాలు అదుర్స్ అనే చెప్పాలి.

తెలుగు కూడా చాలా స్ప‌ష్టంగా మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌య్యేలా చేసింది. శాకుంత‌లం సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ అర్హ పాత్ర‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే ఇప్పుడు అర్హ‌కి మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్- కొర‌టాల కాంబినేష‌న్‌లో ప్ర‌స్తుతం దేవ‌ర అనే చిత్రం రూపొందుతుండ‌గా, ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇటీవ‌ల సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించనున్నాడు.

 

ప్రస్తుతం దేవ‌ర చిత్రం ఐద‌వ‌ షెడ్యూల్ ని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జ‌రుపుకుంటుండ‌గా, ఇటీవ‌ల ఎన్టీఆర్, సైఫ్ మ‌ధ్య స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించారు. క‌థానాయిక జాన్వీ క‌పూర్ కూడా షూటింగ్‌లో పాల్గొంటుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ని సంప్ర‌దించిన‌ట్టు టాక్. కొర‌టాల‌.. బ‌న్నీకి కాల్ చేసి ఇలా అర్హ‌ని తీసుకుందామ‌ని అనుకుంటున్నామ‌ని చెప్ప‌గా, మరో మాట లేకుండా ఓకే అనేశాడ‌ట‌. వచ్చే నెలలో అల్లు అర్హ పాత్ర కి సంబంధించిన షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ట‌. చిత్రంలో అర్హ పాత్ర ప‌ది నిమిషాల పాటు ఉంటుంద‌ని, అందుకుగాను 20 లక్షల రూపాయిల పారితోషికం తీసుకోనున్న‌ట్టు సమాచారం. ఇదే నిజ‌మైతే అర్హకి నిమిషానికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఇస్తున్న‌ట్టే మ‌రి.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...