Home Film News Mahesh Babu: మ‌హేష్ బాబు ప్లానింగ్ మూములుగా లేదు.. పిల్ల‌ల విష‌యంలో ఆలోచ‌న అదుర్స్
Film News

Mahesh Babu: మ‌హేష్ బాబు ప్లానింగ్ మూములుగా లేదు.. పిల్ల‌ల విష‌యంలో ఆలోచ‌న అదుర్స్

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎంత ఎదిగిన మ‌హేష్ బాబుది ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం. త‌ను సంపాదించిన మొత్తంలో మ‌హేష్ కొంత భాగాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కి కేటాయిస్తుంటాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా వెలుగుతున్న మ‌హేష్ బాబు త‌న పిల్లలని కూడా సినిమా ఇండ‌స్ట్రీలోకి తీసుకురానున్నాడ‌ని ఎప్ప‌టి నుండో ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఈ విష‌యంపై ఓ కార్య‌క్ర‌మంలో న‌మ్ర‌త పూర్తి క్లారిటీ ఇచ్చింది.

గౌత‌మ్ వయ‌స్సు ఇప్పుడు 16 ఏళ్లు మాత్ర‌మే. ప్ర‌స్తుతం అత‌ని దృష్టి అంతా చ‌దువుపైనే ఉంది. ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదు. రాబోయే రోజుల‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాతే గౌత‌మ్ తెరపై క‌నిపించాలా లేదా అనే ఆలోచ‌న చేస్తామ‌ని పేర్కొంది న‌మ్ర‌త‌. ఇప్ప‌టికే గౌతమ్ వ‌న్ నేనొక్క‌డినే చిత్రంలో క‌నిపించి సంద‌డి చేశాడు. ఇక గౌత‌మ్ చ‌దువుతో పాటు స్విమ్మింగ్ లోనూ నైపుణ్యం సాధించారు. మరోవైపు థియేటర్ ఆర్ట్స్ లోను శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఓ ఇంగ్లీష్ నాటకంలో క‌నిపించిన గౌత‌మ్… గుక్కతిప్పకుండా డైలాగ్స్ చెబుతూ అంది దృష్టిని ఆక‌ర్షించాడు

 

ఇక సితార విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం తాను యాక్టింగ్, డాన్స్ లో శిక్షణ పొందారు. పదేళ్లు రాకముందు నుంచే సితార సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పదేళ్లకే తాను మంచి డ్యాన్సర్ గా ప్రూవ్ చేసుకుంటూ, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారింది సితార‌. ఇటీవల అంతర్జాతీయ బ్రాండ్ పీఎంజే జ్యూవెల్లరీకి అంబాసిడర్ గా మారి సెన్సేషన్ సృష్టించింది. ఇక రీసెంట్‌గా జ‌రిగిన మీడియా స‌మావేశంలో సితార మాట్లాడుతూ.. తన డెస్టినేషన్ సినిమానే అన్నట్లు సమాధానం ఇచ్చేసారు సితార. మరోవైపు తల్లి నమ్రత కూడా తామేమీ ఫోర్స్ చేయమని, వారి ఇష్టం ఎలా అయితే అలా మేము ముందుకు సాగుతామ‌ని చెప్పుకొచ్చారు.

Related Articles

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌...

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...